LOADING...
Russia: ఉద్యోగులను ఆర్మీకి పంపండి.. సంస్థలకు కీలక ఆదేశాలు
ఉద్యోగులను ఆర్మీకి పంపండి.. సంస్థలకు కీలక ఆదేశాలు

Russia: ఉద్యోగులను ఆర్మీకి పంపండి.. సంస్థలకు కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం తీవ్ర మానవ నష్టాన్ని మిగిల్చింది. ఈ కాలంలో సుమారు 3.25 లక్షల రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో సైన్యాన్ని మళ్లీ బలోపేతం చేసేందుకు రష్యా అధికారులు కాంట్రాక్టు పద్ధతిలో భారీ స్థాయిలో సైనికులను సమీకరించే చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఈ నియామకాలు రహస్యంగా కొనసాగుతున్నాయని, సైనిక శిక్షణ పొందినవారితో పాటు సాధారణ పౌరులను కూడా రష్యన్ ఆర్మీలో చేరాలని అధికారులు పిలుపునిస్తున్నట్లు తెలుస్తోంది. సైనిక సేవల కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉద్యోగులను నామినేట్ చేయాలని పలు పెద్ద కంపెనీలు, వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది.

వివరాలు

ఎంపికైన వారికి శిక్షణ

ప్రత్యేకంగా రియాజాన్ నగర గవర్నర్ కంపెనీలకు రహస్య నోటీసులు పంపినట్లు సమాచారం. సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను సైనిక అభ్యర్థులుగా ఎంపిక చేసి, వారి జాబితాను సెప్టెంబర్ 20లోగా సమర్పించాలని ఆదేశించినట్లు నివేదిక పేర్కొంది. సంస్థ పరిమాణాన్ని బట్టి అభ్యర్థుల సంఖ్య నిర్ణయించనున్నారు. 150 నుంచి 300 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు కనీసం ఇద్దరిని, 300 నుంచి 500 మంది ఉన్న సంస్థలు ముగ్గురిని, 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు ఐదుగురిని ఎంపిక చేసి పంపాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను పాటించని సంస్థలపై భారీ జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి యుద్ధానికి సిద్ధం చేయాలని రష్యా మిలిటరీ, నేవీఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు.

Advertisement