
Iran: ఇరాన్‌లో సంచలనం.. బాలికపై హత్యాచారం చేసిన దోషికి బహిరంగంగా ఉరిశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ఒక బాలికను హత్యాచారం చేసిన ఘోర కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇరాన్ అధికారులు బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక మీడియా కథనాల ప్రకారం, బుకాన్‌కు చెందిన బాలికపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన నిందితుడిపై తీవ్ర స్థాయిలో ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో నిందితుడికి మరణశిక్ష ఖరారు చేయగా, తదుపరి సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. భావోద్వేగాలతో ముడిపడిన కేసు కావడంతో న్యాయవ్యవస్థ ఈ శిక్షపై కఠినమైన నిర్ణయం తీసుకుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Details
ఇరాన్ లో బహిరంగ మరణశిక్షలు సాధారణం
బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఈ శిక్షను బహిరంగంగా అమలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌లో ఇటువంటి కేసుల్లో బహిరంగ మరణశిక్షలు సాధారణం. ముఖ్యంగా హత్య, అత్యాచారం వంటి అత్యంత తీవ్ర నేరాలపై ఈ విధమైన చర్యలు తీసుకుంటారు. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా మరణశిక్షలు అమలుచేసే దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో చైనా కొనసాగుతోంది. ఈ ఘటన మానవ హక్కుల పరిరక్షణపై మరోసారి దృష్టిని సారించగా, ఇలాంటి శిక్షలు నేరాల నియంత్రణకు ప్రభావవంతంగా పనిచేస్తాయా అనే చర్చను మళ్లీ ప్రస్తుత పరిణామాల మధ్య నెరపించింది.