
Errol Musk: సొంత పిల్లలనే లైంగిక వేధించాడంటూ ఎలాన్ మస్క్ తండ్రిపై సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తండ్రి, ప్రపంచ కుబేరుడు ఎరోల్ మస్క్‌పై సంచలన లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం, ఎరోల్ మస్క్ తన ఐదుగురు సొంత పిల్లలు మరియు సవతి తల్లి పిల్లలను లైంగికంగా వేధించారని సమాచారం. ఈ వార్త వెలువడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఈ ఆరోపణ నిజమేనా అనే సందేహాలు తలెత్తాయి. 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం, ఈ ఆరోపణలు 1993 నుండి ఉన్నాయి. దాదాపు 32 సంవత్సరాలుగా ఎరోల్ మస్క్ తన పిల్లలను వేధిస్తున్నారని ఆరోపణలున్నాయి. నివేదిక లేఖలు, ఈమెయిల్స్, కోర్టు పత్రాలు, కుటుంబ సభ్యులతో ఇంటర్వ్యూల ఆధారంగా తయారుచేయబడిందని వెల్లడించింది.
Details
సవతి కుమార్తె సంచలన ఆరోపణలు
ముఖ్యంగా సవతి కుమార్తె స్వయంగా ఈ విషయాలను వెల్లడించిందని చెప్పబడింది. గతంలో ఆమె తన బంధువులకు ఎరోల్ మస్క్ తనను అసభ్యంగా తాకాడని చెప్పినప్పటి సమాచారాన్ని కూడా నివేదిక పేర్కొంది. సంవత్సరాల తర్వాత అదే సవతి కుమార్తె ఎరోల్ మస్క్ తన లోదుస్తుల వాసన చూసి పట్టుకున్నట్లు ఆరోపించిందని తెలిపింది. అదనంగా, ఇద్దరు కుమార్తెలు, ఒక సవతి కుమారుడు కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు నివేదికలో ఉంది. ఈ ఆరోపణలపై మూడు వేర్వేరు దర్యాప్తులు జరిగాయని నివేదిక తెలిపింది. వీటిలో రెండు కేసులు చర్య తీసుకోకుండానే మూసివేయబడ్డాయి. మూడో దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొంది. ఎరోల్ మస్క్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
Details
ఎరోల్ కు తొమ్మిది మంది పిల్లలు
"ఇవి నిర్ధారించబడని ఆరోపణలు. నేను ఎప్పుడూ నా పిల్లలను లైంగికంగా వేధించలేదు. ఈ ఆరోపణలు నా కుమారుడు ఎలాన్ మస్క్ నుంచి డబ్బులు లాగడానికి కుటుంబ సభ్యులు చేసిన కుట్రని ఆయన తెలిపారు. ఎరోల్ మస్క్ మూడు వివాహాల ద్వారా కనీసం తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చారు. వీటిలో సవతి పిల్లలు కూడా ఉన్నారు. లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత, కుటుంబ సభ్యులు ఎలాన్ మస్క్‌ను సంప్రదించి సహాయం పొందినట్లు నివేదిక తెలిపింది. అయితే, ఆయన ఏ విధంగా జోక్యం అయ్యారనే వివరాలు స్పష్టంగా ఇవ్వబడలేదు.