Loading...
US-Iran: అమెరికాలో ఇరాన్‌ దౌత్యవేత్తలకు ఎదురుదెబ్బ.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
అమెరికాలో ఇరాన్‌ దౌత్యవేత్తలకు ఎదురుదెబ్బ.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశం

US-Iran: అమెరికాలో ఇరాన్‌ దౌత్యవేత్తలకు ఎదురుదెబ్బ.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (UNGA) కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు ఇరాన్‌ దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది. సర్వసభ్య సమావేశాలు ముగిసిన తర్వాత అమెరికాను విడిచి వెళ్లాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఆదేశించినప్పటికీ.. ఆ ఆదేశాలను ధిక్కరించిన కారణంగా వారిపై ట్రంప్‌ సర్కార్‌ చర్యలు తీసుకుంది. అమెరికా అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇద్దరు ఇరాన్‌ దౌత్యవేత్తల్లో ఒకరు శుక్రవారం అమెరికాను విడిచి వెళ్లారు. మరొకరు శనివారం యూఎస్‌ నుంచి బయటకు వెళ్లినట్లు సదరు అధికారి తెలిపారు. ఈ వ్యవహారంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు ఆ అధికారి వెల్లడించారు.

వివరాలు

నిలిచిపోయిన అమెరికా-ఇరాన్‌ చర్చలు

అమెరికా విదేశాంగ శాఖ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతోనే ఇద్దరు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.

అమెరికా, ఇరాన్‌ మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగినప్పటికీ.. ఎలాంటి పురోగతి కనిపించలేదు. UNGA సమావేశాలు ముగిసిన తర్వాత ఇరాన్‌ ప్రతినిధి బృందం అమెరికాను విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశించినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి.

అయితే ఆ ఆదేశాలను ఇద్దరు ఇరాన్‌ దౌత్యవేత్తలు ధిక్కరించడంతో వారిని అమెరికా నుంచి బహిష్కరించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చర్చలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో..ఇద్దరు ఇరాన్‌ దౌత్యవేత్తల బహిష్కరణ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT