LOADING...
US warplanes crashed: కువైట్ లో కూలిన అమెరికా యుద్ధవిమానాలు.. సిబ్బంది సురక్షితం
కువైట్ లో కూలిన అమెరికా యుద్ధవిమానాలు.. సిబ్బంది సురక్షితం

US warplanes crashed: కువైట్ లో కూలిన అమెరికా యుద్ధవిమానాలు.. సిబ్బంది సురక్షితం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కువైట్‌లో అమెరికా యుద్ధవిమానాలు కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఈ ఉదయం పలు అమెరికా వార్‌ప్లేన్‌లు కుప్పకూలినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే విమానాల్లో ఉన్న సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడినట్లు స్పష్టం చేసింది. ఘటనపై ప్రకటన విడుదల చేసిన రక్షణ శాఖ ప్రతినిధి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు శోధన, రక్షణ చర్యలు ప్రారంభించి సిబ్బందిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా యుద్ధవిమానాలు క్రాష్.. సిబ్బంది సురక్షితం

Advertisement