LOADING...
Kash Patel: ఆమె నిజమైన దేశభక్తురాలు: జెట్‌లో వెళ్తే తప్పేంటి? స్నేహితురాలిని సమర్థించిన కాష్ పటేల్ 
స్నేహితురాలిని సమర్థించిన కాష్ పటేల్

Kash Patel: ఆమె నిజమైన దేశభక్తురాలు: జెట్‌లో వెళ్తే తప్పేంటి? స్నేహితురాలిని సమర్థించిన కాష్ పటేల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రియురాలితో కలిసి అధికారిక జెట్‌లో విహరించిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా షట్‌డౌన్‌ ప్రభావంతో ఉద్యోగులు జీతాల కోసం ఇబ్బంది పడుతుంటే, పటేల్ మాత్రం ప్రియురాలితో సరదాగా ప్రయాణాలు చేస్తున్నారంటూ వివాదం చెలరేగింది. ఈ ఆరోపణలపై కాష్ పటేల్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. తన స్నేహితురాలు అలెక్సిస్ విల్కిన్స్‌ దేశభక్తురాలని, అధికారిక జెట్‌ వినియోగంపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని పేర్కొన్నారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలేనని పటేల్‌ తిప్పికొట్టారు. సోషల్‌ మీడియాలో పటేల్‌ చేసిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ''నన్ను ఎంతగా విమర్శించినా పరవాలేదు, కానీ నా వ్యక్తిగత జీవితాన్ని లేదా నా చుట్టుపక్కల వారిని లక్ష్యంగా చేసుకోవడం అసభ్యకరం'' అని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

అసలేం జరిగిందంటే.. 

అయితే జెట్‌ ప్రయాణ వివరాలు బహిర్గతం చేసిన వారిపై పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 45 ఏళ్ల కాష్ పటేల్‌, 26 ఏళ్ల సింగర్ అలెక్సిస్ విల్కిన్స్ మధ్య ప్రేమ సంబంధం ఉంది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన రెజ్లింగ్‌ ఈవెంట్‌లో విల్కిన్స్ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ తన అధికారిక జెట్‌ను వర్జీనియా నుంచి పెన్సిల్వేనియాకు 40 నిమిషాల ప్రయాణానికి ఉపయోగించారు. ఈ ప్రయాణానికి సుమారు 60 మిలియన్ల వరకు వ్యయం అయినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రియురాలికోసం ప్రభుత్వ వనరులు ఉపయోగించడం తగదని ఆయన విమర్శించారు.

వివరాలు 

ప్రైవేట్‌ ఈవెంట్‌లకు అధికారిక జెట్‌  వినియోగించినట్లు ఆరోపణలు 

దేశం షట్‌డౌన్‌ కారణంగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు ఉన్నప్పటికీ, పటేల్ మాత్రం ప్రజల డబ్బుతో వ్యక్తిగత వినోదం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. నియమాల ప్రకారం ప్రభుత్వాధికారులు అధికారిక వాహనాలు లేదా జెట్‌లను వ్యక్తిగత కార్యక్రమాల కోసం వినియోగించరాదు. ఒకవేళ ఉపయోగిస్తే, దానికి సంబంధించిన ఖర్చు ప్రభుత్వానికి చెల్లించాలి. అయినప్పటికీ, కాష్ పటేల్‌ గతంలోనూ కొన్ని ప్రైవేట్‌ ఈవెంట్‌లకు అధికారిక జెట్‌ను వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు? 

అలెక్సిస్ విల్కిన్స్‌ ఒక గాయని, రచయిత్రి, వ్యాఖ్యాత మాత్రమే కాకుండా ప్రెస్‌ సెక్రటరీగా కూడా పని చేశారు. స్విట్జర్లాండ్‌, ఇంగ్లాండ్‌లలో బాల్యాన్ని గడిపి, బెల్మాంట్‌ యూనివర్శిటీలో వ్యాపారశాస్త్రం, రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 2022లో జరిగిన ఒక కార్యక్రమంలో కాష్ పటేల్‌, విల్కిన్స్‌ మొదటిసారి కలుసుకున్నారు. 2023 నుండి ఇద్దరూ డేటింగ్‌ కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాష్ పటేల్‌ చేసిన ట్వీట్