Loading...
India-Bangladesh:షేక్ హసీనా అప్పగింతపై భారత్-బంగ్లాదేశ్ చర్చలు.. కీలక అంశాలపై భేటీ
షేక్ హసీనా అప్పగింతపై భారత్-బంగ్లాదేశ్ చర్చలు.. కీలక అంశాలపై భేటీ

India-Bangladesh:షేక్ హసీనా అప్పగింతపై భారత్-బంగ్లాదేశ్ చర్చలు.. కీలక అంశాలపై భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు అప్పగించే అంశంపై భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ వ్యవహారంపై సోమవారం (ఆగస్టు 10) ఢాకాలో భేటీ జరిగింది. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది.. ఆ దేశ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా షేక్ హసీనా అప్పగింత వ్యవహారం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

వివరాలు 

భేటీకి సంబంధించిన వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించిన దినేష్ త్రివేది

హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆశిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం పేర్కొంది.

దీంతో పాటు స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హదీ హత్య కేసులో నిందితుడిని తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావడం గురించి కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపింది.

భేటీకి సంబంధించిన వివరాలను భారత హైకమిషనర్ దినేష్ త్రివేది ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

బంగ్లాదేశ్‌తో సానుకూలంగా, నిర్మాణాత్మకంగా, భవిష్యత్ దృష్టితో కలిసి పనిచేయాలన్న భారత్ ఉద్దేశాన్ని ఆ దేశ ప్రధానమంత్రికి వివరించినట్లు తెలిపారు.

సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు.

వివరాలు 

తారిక్ రెహమాన్‌ ప్రజల మనిషి: త్రివేది

భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు త్రివేది తెలిపారు.

ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, పరస్పరంగా ఎదురవుతున్న కొన్ని సమస్యలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్‌ను కలవడం తనకు సంతోషంగా ఉందని త్రివేది పేర్కొన్నారు. ఆయనను ప్రజల మనిషిగా అభివర్ణిస్తూ ప్రశంసించారు.

తాజా భేటీ ద్వారా హసీనా అప్పగింతతో పాటు భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన పలు అంశాలు మరోసారి చర్చకు వచ్చినట్లైంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హసీనా అప్పగింతపై భారత్‌ను కోరిన బంగ్లాదేశ్.. ద్వైపాక్షిక అంశాలపైనా చర్చ

ADVERTISEMENT