Sheikh Hasina: నేడు మీడియా ముందుకు షేక్ హసీనా.. రెండేళ్ల తర్వాత తొలి ప్రెస్ మీట్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చిన రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా బుధవారం దిల్లీ నుంచి మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం అనంతరం అధికారాన్ని కోల్పోయి భారత్‌కు వచ్చిన తర్వాత ఆమె తొలిసారిగా విలేకరులతో మాట్లాడబోతున్నారు. ఈ సమావేశంలో హసీనా వర్చువల్ విధానంలో పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
వివరాలు
హసీనా అభిప్రాయాలకు భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు
అయితే,ఈ మీడియా సమావేశానికి లేదా అందులో హసీనా వ్యక్తం చేసే అభిప్రాయాలకు భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
హసీనా మీడియా సమావేశంపై తమ అధికారిక వైఖరిని వెల్లడించాలని బంగ్లాదేశ్ ఇప్పటికే కోరిన నేపథ్యంలో భారత్ ఈ వివరణ ఇచ్చింది.
విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తోందని, దీనిలో భారత ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.