Loading...
Sheikh Hasina: రెండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షేక్ హసీనా.. భవిష్యత్‌పై కీలక ప్రకటన?
రెండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షేక్ హసీనా.. భవిష్యత్‌పై కీలక ప్రకటన?

Sheikh Hasina: రెండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షేక్ హసీనా.. భవిష్యత్‌పై కీలక ప్రకటన?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) రెండేళ్ల తర్వాత తొలిసారి బహిరంగంగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. స్వదేశంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి ప్రాణభయంతో భారత్‌లో ఆశ్రయం పొందిన ఆమె, ఆగస్టు 5న ఢిల్లీ నుంచి వర్చువల్‌ ద్వారా ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్‌, తదుపరి కార్యాచరణపై కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవామీ లీగ్‌ అధినేత్రిగా 16 సంవత్సరాలు బంగ్లాదేశ్ ప్రధానిగా సేవలందించిన షేక్ హసీనాకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంతో పాటు ఆమె పాస్‌పోర్టును కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

వివరాలు

ఆగస్టు 5న సాయంత్రం 6 గంటల నుంచి ప్రసంగం

ఈ పరిస్థితుల్లోనూ డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని తాను భావిస్తున్నట్లు హసీనా ఇప్పటికే ప్రకటించారు.

అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా కనిపించడం లేదు.

స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న షేక్ హసీనాను దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తామని బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి ఎం. అసాదుజ్జమన్ (M Asaduzzaman) హెచ్చరించారు.

అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.

ఢిల్లీలోని దక్షిణాసియా ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్ (FCC South Asia) ఆధ్వర్యంలో ఆగస్టు 5 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఈ వర్చువల్ కార్యక్రమం జరగనుంది.

వివరాలు

ఆందోళన కారణంగా పదవిని కోల్పోయిన షేక్ హసీనా

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే తేదీన విద్యార్థుల ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవిని కోల్పోయారు.

ఆమె ప్రసంగం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హసీనా తనపై విధించిన ఉరిశిక్షపై అప్పీల్‌ చేస్తారా? స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రణాళికను ప్రకటిస్తారా? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. భారత్‌కు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆమె మీడియా ముందుకు రాలేదు.

ఈ కార్యక్రమానికి ఎఫ్‌సీసీ దక్షిణాసియా అధ్యక్షుడు డాక్టర్ వాఎల్ అవ్వాద్ అధ్యక్షత వహించనున్నారు

. షేక్ హసీనాతో పాటు ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, బంగ్లాదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి మొహిబుల్ హసన్ చౌదరీ, ముహమ్మద్ అలీ సిద్దిఖీ, మాజీ క్రికెటర్ షకీబుల్ హసన్ కూడా ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ADVERTISEMENT