Loading...
Indonesia: జావా సముద్రంలో నౌక గల్లంతు.. 240 మంది ప్రయాణికులు!
జావా సముద్రంలో నౌక గల్లంతు.. 240 మంది ప్రయాణికులు!

Indonesia: జావా సముద్రంలో నౌక గల్లంతు.. 240 మంది ప్రయాణికులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియా (Indonesia) వద్ద జావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. తూర్పు జావా (Java) నుంచి కాళీమంతన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బంజార్‌మసన్‌లోని సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ కార్యాలయం స్పందించింది. సురబాయ నుంచి బయల్దేరిన విర్గో ట్రాన్స్‌పోర్ట్‌ 8 నౌక ఒక్కసారిగా కమ్యూనికేషన్లను కోల్పోయింది. చివరిసారిగా బంజార్‌మసన్‌కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో నౌక నుంచి కమ్యూనికేషన్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే నౌక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

వివరాలు

నౌక ఆచూకీ కోసం గాలింపు చర్యలు

త్రిశక్తి పోర్ట్‌ను కేంద్రంగా చేసుకుని సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

నౌక ప్రయాణిస్తున్న ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు చివరిసారిగా జరిగిన కమ్యూనికేషన్‌లో తెలిసినట్లు సమాచారం.

ఈ పరిస్థితుల నేపథ్యంలో నౌక ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ADVERTISEMENT