LOADING...
US : అమెరికాలో రెస్టారెంట్ వద్ద కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి
అమెరికాలో రెస్టారెంట్ వద్ద కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి

US : అమెరికాలో రెస్టారెంట్ వద్ద కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్‌ కరోలినాలోని 'అమెరికన్‌ ఫిష్‌ కంపెనీ రెస్టరెంట్‌' సమీపంలో శనివారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం)ఘోర ఘటన చోటుచేసుకుంది. ఒకరు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారుల వివరాల ప్రకారం, గుర్తు తెలియని ఒక బోటు సౌత్‌ పోర్ట్ యాచ్ బేసిన్‌లో ఉన్న రెస్టారెంట్‌ దగ్గరకు వచ్చింది. బోటులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రెస్టారెంట్‌పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం దుండగుడు అదే బోటులో పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు గాలింపు ప్రారంభించారు. దాడికి గల కారణాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.