LOADING...
White House Dinner Shooting: వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి సీసీటీవీ వీడియో రిలీజ్
వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి సీసీటీవీ వీడియో రిలీజ్

White House Dinner Shooting: వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి సీసీటీవీ వీడియో రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ముఖ్యమైన సీసీటీవీ వీడియోను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. వీడియోలో నిందితుడు అలెన్‌ భద్రతా వలయాన్ని ఎలా ఛేదించాడో స్పష్టంగా కనిపిస్తోంది. హోటల్‌లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ గుండా అతను ఒక్కసారిగా దూసుకెళ్లి కాల్పులకు తెగబడ్డ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ దాడిలో విధుల్లో ఉన్న ఒక సీక్రెట్ సర్వీస్ అధికారి గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే ఈ వీడియోను ప్రజలకు విడుదల చేసినట్లు అమెరికా అధికార వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు

ఏప్రిల్ 24న ఘటన

ఈ కాల్పుల ఘటన ఏప్రిల్‌ 24న వాషింగ్టన్ హిల్టన్‌లో నిర్వహించిన వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్ సందర్భంగా జరిగింది. ఈ సంఘటన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియోలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సంఘటన అమెరికా భద్రతా వ్యవస్థలపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తగా, నిందితుడి కదలికలు, భద్రతా లోపాలపై దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement