
USA: అమెరికా షికాగోలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, 14 మంది గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని షికాగో నగరంలో కాల్పుల ఘటన ఉద్రిక్తతను కలిగించింది. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన చికాగోలోని రివర్ నార్త్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అక్కడి ఓ రెస్టారెంట్ వద్ద ఆల్బమ్ విడుదల కార్యక్రమం జరుగుతుండగా, అదే సమయంలో లాంజ్‌లో ఉన్నవారిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అతడు ఘటన స్థలాన్ని వదిలి పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు.
వివరాలు
ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు మృతి
మొత్తంగా 18 మందిపై దాడి జరిగినట్లు సమాచారం. వీరిలో 13 మంది మహిళలు కాగా, ఐదుగురు పురుషులు ఉన్నారు. కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందారని అధికారులు నిర్ధారించారు. బాధితుల వయసు 21 నుంచి 32 సంవత్సరాల మధ్యగా ఉందని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు.