LOADING...
Gun Violence: ప్రిటోరియాలో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా 11 మంది మృతి
ప్రిటోరియాలో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా 11 మంది మృతి

Gun Violence: ప్రిటోరియాలో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా 11 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతం శనివారం తెల్లవారుజామున రక్తపాతంతో కలకలం రేగింది. ఉదయం 4:15 తర్వాత చోటుచేసుకున్న ఈ భయంకర దాడిలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం అక్కడి ప్రజలను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై సమాచారం వారికి ఉదయం 6 గంటల సమయంలో అందింది. వెంటనే స్పందించిన అధికారులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్సను ప్రారంభించారు.

Details

విచక్షణారహితంగా కాల్పులు

పోలీస్ సర్వీస్ (SAPS) తెలిపిన ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం, ముగ్గురు ఆయుధదారుల గ్యాంగ్ ఈ కాల్పులకు కారణంగా గుర్తించారు. భారీ శబ్దాలు వినిపించగానే స్థానికులు ఏమి జరుగుతోందో తెలుసుకునేలోపే దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడికక్కడే పలువురిని కుప్పకూలేలా చేశారు. పోలీసులు ప్రస్తుతం ఈ దుండగుల కోసం విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ దాడికి కారణంగా ఆ ప్రాంతంలో పెచ్చరిల్లిన అక్రమ మద్యం దుకాణాలనే అధికారులు చూపిస్తున్నారు. లైసెన్స్ లేని బార్లు, పబ్‌లు అధికంగా ఉండటం వల్ల అక్కడ తరచూ గొడవలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని విచారణలో వెల్లడైంది.

Advertisement