Page Loader
Texas: ఆకాశంలో ఉండగా ఇంజిన్‌లో సమస్య .. టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా లాండింగ్ 
Texas: ఆకాశంలో ఉండగా ఇంజిన్‌లో సమస్య .. టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా లాండింగ్

Texas: ఆకాశంలో ఉండగా ఇంజిన్‌లో సమస్య .. టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా లాండింగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2023
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆకాశంలో ఉండగా ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది.దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. టెక్సాస్‌లోని విలియం పి హాబీ విమానాశ్రయం నుంచి Southwest Airlines కు చెందిన Boeing Plane మెక్సికో లోని కాంకస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరింది. టేకాఫ్‌ అయిన వెంటనే ఒక ఇంజిన్‌ నిప్పులు చిమ్మి వెనకవైపు మంటలుఅంటుకున్నాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది అరగంట వ్యవధిలో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒకానొక ప్రయాణికుడు మాట్లాడుతూ.. ' ముందుగా ఏదో పేలిన శబ్దం వినిపించిన తర్వాత ఫ్యూయల్ వాసన వచ్చిందన్నారు. మెకానికల్‌ సమస్యతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విమానయాన సంస్థ తెలిసింది. ప్రయాణికులందరినీ వేరే విమానంలో గమ్యస్థానాలకు పంపించామని తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అత్యవసరంగా ల్యాండ్ అయిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్