LOADING...
Donald Trump: 'అమెరికాను దోచుకున్న దేశాలకు డబ్బులు తిరిగి ఇవ్వాలా?' : ట్రంప్ ఆగ్రహం
'అమెరికాను దోచుకున్న దేశాలకు డబ్బులు తిరిగి ఇవ్వాలా?' : ట్రంప్ ఆగ్రహం

Donald Trump: 'అమెరికాను దోచుకున్న దేశాలకు డబ్బులు తిరిగి ఇవ్వాలా?' : ట్రంప్ ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లు చెల్లవని యూఎస్ సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు. సుప్రీం కోర్టు నిర్ణయం కారణంగా విదేశీ దేశాలు, కంపెనీలకు వందల బిలియన్ డాలర్ల మేర నిధులు తిరిగి చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు వల్ల ఎన్నో సంవత్సరాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు, కంపెనీలకు వందల బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పూర్తిగా అర్థరహితం.

Details

న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు

న్యాయస్థానం ఈ అంశాన్ని సరిగా పరిగణనలోకి తీసుకోలేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రపంచం ఇంతకు ముందు ఇలాంటి తీర్పును చూడలేదు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ కేసును మళ్లీ విచారించే అవకాశం ఉందా?" అని ట్రంప్ ప్రశ్నించారు. ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు 6:3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువ టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరిస్తూ, ప్రపంచ దేశాలపై 15 శాతం సుంకాలు అమలు చేస్తానని ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పులో సుంకాలు చెల్లవని మాత్రమే స్పష్టం చేయబడింది గానీ, ఇప్పటికే వసూలైన మొత్తాలను తిరిగి చెల్లించాలన్న అంశంపై ఎటువంటి ప్రస్తావన లేదని సమాచారం.

Details

ఇరాన్‌పై కఠిన హెచ్చరిక

ఇదిలా ఉండగా, ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని తాను సంకల్పించుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలకు కూడా హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. టెహ్రాన్ ప్రభుత్వం తన అణ్వాయుధ కార్యక్రమాన్ని విరమించేందుకు నిరాకరిస్తే, సైన్యాన్ని వినియోగించాల్సి రావచ్చని హెచ్చరించారు. అయితే అది తనకు ఇష్టమైన మార్గం కాదని కూడా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికా వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమ సైనిక శక్తి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Advertisement