LOADING...
Gurpreet Singh: కాల్చివేతకు ముందు రహదారిపై కత్తితో 'గట్కా' యుద్ధ విద్య ప్రదర్శించిన గురుప్రీత్ సింగ్.. వీడియో ఇదిగో!
కాల్చివేతకు ముందు కత్తితో 'గట్కా' యుద్ధ విద్య ప్రదర్శించిన గురుప్రీత్ సింగ్

Gurpreet Singh: కాల్చివేతకు ముందు రహదారిపై కత్తితో 'గట్కా' యుద్ధ విద్య ప్రదర్శించిన గురుప్రీత్ సింగ్.. వీడియో ఇదిగో!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా,లాస్ ఏంజిల్స్‌లో జూలై 13న జరిగిన సిక్కు వ్యక్తి కాల్చివేత ఘటనకు సంబంధించిన కీలక వీడియోని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోలో,గురుప్రీత్ సింగ్(35)పై పోలీసులు ఎందుకు కాల్పులు జరిపించవలసి వచ్చిందో స్పష్టంగా చూడవచ్చు. ఈ ఘటన నగరంలోని అత్యంత రద్దీ కూడలి అయిన ఒలింపిక్ బౌలేవార్డ్, ఫిగెరోవా స్ట్రీట్ కూడలిలో ఓ వ్యక్తి పెద్ద కత్తితో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విడుదలైన వీడియోలో,గురుప్రీత్ సింగ్ తన కారును రోడ్డు మధ్యలో నిలిపి,కత్తితో విన్యాసాలు చేసుకుంటూ కనిపించాడు. అతను సిక్కుల ప్రాచీన యుద్ధ కళ 'గట్కా'ప్రదర్శన చేస్తూ,కొన్ని సందర్భాల్లో తన నాలుకను కూడా అదే కత్తితో గాయపరిచిన సన్నివేశం వీడియోలో రికార్డు అయింది.

వివరాలు 

అధికారులపైకి కత్తితో దూసుకెళ్లడంతో కాల్పులు 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా, గురుప్రీత్ సింగ్ తన కారుతో ఓ పోలీసు వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకునేందుకుప్రయత్నించగా, పోలీసుల వాహనాలు అతడిని వెంబడించాయి. ఫిగెరోవా,12వ స్ట్రీట్ మధ్యలో అతను తన వాహనాన్ని ఆపగానే, కారు నుండి దిగి చేతిలో కత్తితో పోలీసుల వైపుకు దూసుకొచ్చాడు. పోలీసుల హెచ్చరికలను గౌరవించకుండా, అతను వారిపై ఓ వాటర్ బాటిల్ విసిరి, మళ్లీ పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం అధికారులు అతనిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గురుప్రీత్ సింగ్ రోడ్డు పక్కన విలవిలాడుతూ పడిపోయాడు. తరువాత వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రహదారిపై కత్తితో 'గట్కా' యుద్ధ విద్య ప్రదర్శించిన గురుప్రీత్ సింగ్