Page Loader
సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఆండ్రీ కన్నుమూత

సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత

వ్రాసిన వారు Stalin
Jan 18, 2023
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ప్రముఖ ఫ్రెంచ్ నన్ లూసిల్ రాండన్ మంగళవారం కన్నుమూశారు. ఫ్రాన్స్‌లోని టౌలాన్ నగరంలో 118 సంవత్సరాల వయస్సులో వయసు సంబంధిత సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు రాండన్ కుటుంబ సభ్యులు తెలిపారు. లూసిల్ రాండన్‌ నన్‌గా మారిన తర్వాత తన పేరును ఆండ్రీగా పేరును మార్చుకున్నారు. ఆ పేరుతోనే ఆమె తన సేవలను కొనసాగించారు. ఆండ్రీ మరణంపై టౌలాన్ మేయర్ హుబెర్ట్ ఫాల్కో విచారం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. గత సంవత్సరం 119 సంవత్సరాల వయస్సులో జపాన్‌కు చెందిన కేన్ తనకా మరణించారు. ఆమె తర్వాత.. భూమిపై ఎక్కువ కాలం జీవించిన మహిళగా ఆండ్రీ రికార్డు సృష్టించారు.

ఆండ్రీ

రెండు ప్రపంచ యుద్ధాలను చూసి, మహమ్మారులను జయించిన ధీరురురాలు ఆండ్రీ

1904లో ఫ్రెంచ్ పట్టణంలోని అలెస్‌లో ఆండ్రీ జన్మించారు. 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిని ఆమె జయించారు. రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. ఆండ్రీ తన 19 సంవత్సరాల వయస్సులో కాథలిక్‌గా మారారు. ఎనిమిదేళ్ల తర్వాత నన్‌గా మారి సేవలో నిమగ్నమయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో పిల్లలను చేరదీసింది. యుద్ధం ముగిసిన తర్వాత ఆసుపత్రిలో పనిచేయడానికి విచీకి వెళ్లింది. అక్కడే అనాథలు, వృద్ధులకు సేవలు అందించింది. 2021లో ఆండ్రీ నివసించిన నర్సింగ్‌హోమ్‌లో ఆమెతో మరికొంత మందికి కరోనా సోకింది. ఆ నర్సింగ్‌హోమ్‌లో కరోనాతో 10మంది చనిపోయినా.. ఆండ్రీ వైరస్‌ను జయించి అందరినీ ఆశ్చర్యపరచింది.