LOADING...
Mexico: సెంట్రల్ మెక్సికోలో విమానం కూలి.. 7 మంది మృతి 
సెంట్రల్ మెక్సికోలో విమానం కూలి.. 7 మంది మృతి

Mexico: సెంట్రల్ మెక్సికోలో విమానం కూలి.. 7 మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మధ్య మెక్సికోలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన ఓ చిన్న విమానం కుప్పకూలి కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మెక్సికో రాష్ట్ర సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ అడ్రియాన్ హెర్నాండెజ్ ధ్రువీకరించారు. టోలుకా విమానాశ్రయానికి సుమారు మూడు మైళ్ల దూరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతం సాన్ మాటియో అతెంకోలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం మెక్సికో సిటీకి పశ్చిమాన దాదాపు 31 మైళ్ల దూరంలో ఉంది. అధికారుల వివరాల ప్రకారం, పసిఫిక్ తీరంలోని అకపుల్కో నుంచి బయలుదేరిన ఈ ప్రైవేట్ జెట్ సాంకేతిక సమస్యలతో అత్యవసరంగా దిగేందుకు ప్రయత్నించింది.

వివరాలు 

ప్రమాదం జరిగే వేళ విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది

ఫుట్‌బాల్ మైదానంలో ల్యాండ్ కావడానికి యత్నించిన సమయంలో విమానం నియంత్రణ తప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగే వేళ విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత వరకు ఏడుగురు మృతదేహాలను మాత్రమే సహాయక బృందాలు వెలికి తీశాయి. ల్యాండింగ్ ప్రయత్నంలో ఉన్న విమానం సమీపంలోని ఓ వ్యాపార భవనం పైకప్పును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

విమానం కూలిపోవడంతో భారీగా మంటలు 

అకస్మాత్తుగా విమానం కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సాన్ మాటియో అతెంకో మేయర్ అనా మునీస్ మిలెనియో మీడియాతో మాట్లాడుతూ, మంటల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యల భాగంగా పరిసర ప్రాంతాల్లోని సుమారు 130 మందిని ఖాళీ చేయించినట్లు చెప్పారు. విమాన ప్రమాదానికి దారి తీసిన కారణాలను గుర్తించి పూర్తి నివేదిక అందించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సెంట్రల్ మెక్సికోలో కూలిన చిన్న విమానం 

Advertisement