Loading...
Vladimir Putin: భారత్‌లో ఇన్ని భాషలా? ఆశ్చర్యపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్!
భారత్‌లో ఇన్ని భాషలా? ఆశ్చర్యపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్!

Vladimir Putin: భారత్‌లో ఇన్ని భాషలా? ఆశ్చర్యపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. దేశంలోని ఒక్కో ప్రాంతానికి ప్రత్యేక భాష, మాండలికం, సాంస్కృతిక గుర్తింపు ఉండటం అద్భుతమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ.. భారత్‌లో భాషల వైవిధ్యం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. సెర్బియన్ చిత్ర దర్శకుడు ఎమిర్ కుస్తురికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత జనాభా సుమారు 150 కోట్లు ఉంటుందని, అందులో దాదాపు 6 కోట్ల మంది ఒక ప్రధాన భాష మాట్లాడుతుండగా.. మిగిలినవారు వివిధ ప్రాంతీయ భాషలను ఉపయోగిస్తున్నారని మోదీతో సంభాషణ సందర్భంగా తెలుసుకున్నట్లు వివరించారు.

వివరాలు

భారత ప్రాచీన నాగరికతపైనా ప్రశంసలు

ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో ఇన్ని భాషలు, భాషా వైవిధ్యం ఉండటం నిజంగా ఆశ్చర్యకరమని పుతిన్ అన్నారు.

భారత భాషా వైవిధ్యంతో పాటు ప్రాచీన నాగరికతను కూడా పుతిన్ ప్రశంసించారు.

భారత సాంస్కృతిక వైవిధ్యం ప్రత్యేకమైనదని, ప్రధానితో మాట్లాడటం వల్ల భారత్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నానని వెల్లడించారు.

వివరాలు

రష్యా నాగరికత గురించి ఏమన్నారంటే?

ఇదే సందర్భంగా రష్యా నాగరికత ప్రత్యేకతలను కూడా పుతిన్ వివరించారు.

రష్యాలో వివిధ జాతులు, వర్గాల ప్రజలు తమ మతాలు, సంప్రదాయాలు, భాషలు, ఆధ్యాత్మిక గుర్తింపును పరిరక్షించుకునే అవకాశం ఉందని చెప్పారు.

రష్యన్ నాగరికత ఎవరినీ ఎన్నడూ అణచివేయలేదని పేర్కొన్నారు. విభిన్న వర్గాల ప్రజలు తమ ప్రత్యేక గుర్తింపులతో జీవించేందుకు అవకాశం కల్పించడమే రష్యా నాగరికతలోని ముఖ్యమైన లక్షణమని వివరించారు.

ADVERTISEMENT