కోతులే కదా అనుకుంది చిరుత.. పులినే దాడులతో గడగడలాడించిన కోతుల గుంపు
దక్షిణాఫ్రికాలోని ఓ మారుమాల ప్రాంతంలో అనూహ్యం చోటు చేసుకుంది. కోతుల గుంపు వద్దకు వచ్చిన ఓ చిరుతపై అవి భీకరంగా దాడి చేశాయి. సుమారు 50 బబూన్లు నడిరోడ్డుపై తిష్టవేసి హల్‌చల్ సృష్టించాయి. తాను బలవంతుడినని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆ చిరుత అనుకుంది. కోతులే కదా తననేం చేస్తాయని భావించింది. ఇలా తమపై తీవ్రంగా దాడులు చేస్తాయని అస్సలు ఊహించి ఉండకపోవచ్చు. కానీ విధి మరోలా తలచింది. అడవికే అత్యంత బలమైన క్రూర మృగాల్లో చిరుతపులి ఒకటి. కోతుల కంటే అన్నింట బలవంతురాలే. వీటి కన్నా 100 రెట్లు వేగంగా పరుగులు తీయగల సామర్థ్యం చీతా సొంతం.
నడిరోడ్డు మీద హల్ చల్ సృష్టించిన 50 బబూన్లు
అయినప్పటికీ కోతుల గుంపు చేతిలో తీవ్ర దాడికి గురైంది. చివరకు ప్రాణాల కోసం పరుగు లంకించుకుంది. ఇంత జరిగినా కోతుల గుంపు చిరుతను వదలకుండా దాని వెంటే పరిగెత్తాయి. లేటెస్ట్ సైటింగ్స్ ఛానెల్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు 15 గంటల్లో 1.67 లక్షల మంది చూడటం గమనార్హం. సౌత్ ఆఫ్రికన్ దేశంలోని ఓ పల్లెలో నడిరోడ్డుపై కోతుల మంద వీరంగం సృష్టించాయి. వీటి దెబ్బకు రోడ్డుపై ట్రాఫిక్ సైతం నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ఓ చిరుతు అటువైపుగా దర్జాగా నడుచుకుంటూ వెళ్తోంది. అయితే తనను చూసి కోతులు పారిపోతాయి అనే ధైర్యంతోనే అది ముందడుగు వేసింది. చీతాను చూసి భయపడి పారిపోవడం అటుంచి ఏకంగా చిరుతపైనే దాడికి దిగడం విస్మయానికి గురిచేసింది.