
Banana Phobia: స్వీడిష్ మంత్రికి వింత ఫోబియా.. ఆమె వస్తే అరటిపండ్లు కన్పించకుండా చేస్తారట.. ఎందుకో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
స్వీడన్‌కు చెందిన మహిళా మంత్రి పౌలీనా బ్రాండ్‌బర్గ్ అరుదైన ఫోబియాతో బాధపడుతున్నారు.
సాధారణంగా అందరూ ఇష్టపడి తినే అరటిపండ్లంటే ఆమెకు విపరీతమైన భయం కలిగించే పరిస్థితి 'బనానా ఫోబియా'గా (Banana Phobia) పిలుస్తారు.
ఈ భయం కారణంగా, ఆమె హాజరవుతున్న అధికారిక కార్యక్రమాల్లో ఆ పండ్లు ఎక్కడా కనిపించకుండా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇటీవల, ఆమె మంత్రిత్వ శాఖ నుంచి పంపించిన ఒక ఈ-మెయిల్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అందులో, ఆమెకు అలర్జీ ఉండటం వల్ల, ఆమె హాజరవుతున్న గదుల్లో లేదా వేదికలపై అరటిపండ్లు లేకుండా చూడాలని పేర్కొన్నారు.
అంతేకాక, గతంలో పౌలీనా ఈ ఫోబియా గురించి సోషల్ మీడియాలో చెప్పినప్పటికీ, ఆ పోస్టును వెంటనే తొలగించడం గమనార్హం.
వివరాలు
ఈ విషయంలో మనం ఐకమత్యంగా ఉండాలి
నిపుణుల ప్రకారం,బనానా ఫోబియా చాలా అరుదైనది.ఈ ఫోబియా ఉన్న వారికి అరటిపండ్లు చూడటం,వాటి వాసన పీల్చడం వల్ల తీవ్ర ఆందోళన కలుగుతుంది.
ఈ కారణంగా,ఆమె కార్యక్రమాల్లో ఆ పండ్లు అసలు ఉంచొద్దని స్పష్టమైన ఆదేశాలు అందజేశారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,స్వీడన్ పార్లమెంట్‌లో పౌలీనా మాత్రమే కాకుండా మరో మహిళా ఎంపీ తెరీసా కర్వాల్హో కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఫౌలీనా విషయమై ఆమె సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేస్తూ,"కఠినమైన విషయాల్లో విభేదించినా, ఈ విషయంలో మనం ఐకమత్యంగా ఉండాలి"అని పేర్కొన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం,బనానా ఫోబియా చిన్నతనంలోనే ఏర్పడుతుందని భావిస్తున్నారు.
అయితే,దీని స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.ఇలాంటి అరుదైన సమస్యపై ప్రజల దృష్టి మళ్లడం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసింది.