LOADING...
Statue of Liberty: దక్షిణ బ్రెజిల్‌లో భారీ తుఫాను.. కూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం.. వైరల్ అవుతున్న వీడియో 
వైరల్ అవుతున్న వీడియో

Statue of Liberty: దక్షిణ బ్రెజిల్‌లో భారీ తుఫాను.. కూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం.. వైరల్ అవుతున్న వీడియో 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గ్వాయిబా నగరాన్ని బలమైన తుఫాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ తుఫానం కారణంగా,హవాన్ (Havan) అనే అతిపెద్ద రిటైల్ స్టోర్ ముందు ఉన్న స్టాట్యూ అఫ్ లిబర్టీ విగ్రహం గంటకు 90 కిమీకి పైగా వీచిన గాలులకు ఒక్కసారిగా నేలకూలిపోయింది. అయితే, 35 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాన్ని 2020లో హవాన్ చైనా స్టోర్ల ఓపెనింగ్‌ గుర్తుగా ఏర్పాటు చేశారు. తాజాగా వీచిన బలమైన గాలుల కారణంగా, విగ్రహం నెమ్మదిగా వంగి, స్టోర్ పార్కింగ్ లాట్‌లో పడిపోయింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనా సమయంలో అదృష్టవశాత్తు స్టోర్ సిబ్బంది లేదా స్థానికులు అక్కడ లేరు కాబట్టి, ప్రాణనష్టం తప్పింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement