Earthquake: వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీపై ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
వనాటు దీవుల సమీపంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకున్న ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. దీంతో సునామీ ముప్పు ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమైంది. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) వెల్లడించింది. అయితే, ఈ ఘటన కారణంగా ఎక్కడైనా ఆస్తి నష్టం జరిగిందా? ప్రాణనష్టం ఏమైనా సంభవించిందా? అనే విషయాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. యూఎస్‌జీఎస్ వివరాల ప్రకారం.. వనాటు దీవుల్లోని సోలా ప్రాంతానికి పశ్చిమాన సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
వివరాలు
తరచూ భూకంపాలు
భూకంప కేంద్రం సముద్రంలో తక్కువ లోతులో ఉండటంతో సమీప తీర ప్రాంతాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు.
అయితే, ఈ భూకంపం నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
వనాటు దీవులు భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు ఎక్కువగా చోటుచేసుకునే పసిఫిక్ అగ్నిపర్వత వలయం (రింగ్ ఆఫ్ ఫైర్) పరిధిలో ఉన్నాయి.
ఈ ప్రాంతంలో భూఫలకాలు నిరంతరం కదులుతుండటం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
తాజాగా నమోదైన 7.2 తీవ్రత భూకంపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.
భూకంపం ప్రభావం, నష్టం వివరాలపై మరింత సమాచారం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాటు దీవుల సమీపంలో ప్రకంపనలు
A magnitude 6.9 earthquake struck the Pacific Ocean off Vanuatu at a depth of 10 kilometers, according to the US Geological Survey https://t.co/WQxkOdgLlc pic.twitter.com/HKGFWmgW3o
— Anadolu English (@anadoluagency) October 24, 2026