Page Loader
Suchir Balaji: సుచిర్‌ బాలాజీ మృతి.. సీసీటీవీలో రికార్డయిన ఫొటోను పోస్టు చేసిన   పూర్ణిమారావు  
సుచిర్‌ బాలాజీ మృతి.. సీసీటీవీలో రికార్డయిన ఫొటోను పోస్టు చేసిన పూర్ణిమారావు

Suchir Balaji: సుచిర్‌ బాలాజీ మృతి.. సీసీటీవీలో రికార్డయిన ఫొటోను పోస్టు చేసిన   పూర్ణిమారావు  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐలో నాలుగేళ్లుగా పరిశోధకుడిగా పనిచేసిన భారత సంతతి వ్యక్తి, ప్రజా వేగు (విజిల్‌ బ్లోయర్‌) సుచిర్‌ బాలాజీ(26)గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా,తాజాగా అతని తల్లి పూర్ణిమారావు సుచిర్ మరణానికి కొద్దిసేపటి ముందు సీసీటీవీలో రికార్డ్ అయిన ఫొటోను పంచుకున్నారు. సుచిర్‌ మరణానికి ముందు సీసీటీవీ దృశ్యాలు సుచిర్ చనిపోయే కొన్ని నిమిషాల ముందు సీసీటీవీ రికార్డయిన దృశ్యాలను పూర్ణిమారావు షేర్ చేశారు. ఆదృశ్యాల్లో అతడు ఫుడ్ పార్సిల్ పట్టుకొని లిఫ్ట్ ఎక్కుతున్నట్లు కనిపిస్తోంది.ఈఫొటో సుచిర్ మరణించిన రోజు రాత్రి 7:30గంటలకు చెందినదని ఆమె తెలిపారు. ఈ వీడియోను చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం(OCME)పరిశీలించినప్పటికీ,అతడు నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చారు.Embed

వివరాలు 

హత్యకు ముందుగా ప్రణాళికాబద్ధంగా కుట్ర

అయితే, సుచిర్ మరణం తర్వాత మూడు రోజుల తర్వాత నిర్వహించిన శవపరీక్షలో డ్రగ్ మోతాదు అధికంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, వారి నివేదికలో తప్పులున్నాయని, తమ దగ్గర ఉన్న రిపోర్టులో అది తప్పుడు నిర్ధారణ అని తేలిందని పూర్ణిమారావు తెలిపారు. దీనిపై పూర్తి స్పష్టత కోసం టాక్సికాలజిస్ట్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. పూర్ణిమారావు మరో పోస్టులో సుచిర్ హత్యకు ముందుగా ప్రణాళికాబద్ధంగా కుట్ర రచించారని ఆరోపించారు. అతను నివసించే అపార్టుమెంట్ గ్యారేజీ, ఎలివేటర్‌లకు ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవని, అందుబాటులో ఉన్నవి కూడా పనిచేయడం లేదని తెలిపారు.

వివరాలు 

పోలీసుల ప్రాథమిక విచారణ.. న్యాయపోరాటం 

నవంబర్ 26, 2024న శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్టుమెంట్‌లో సుచిర్ మృతి చెందాడు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో పోలీసులు దీన్ని ఆత్మహత్యగా ప్రకటించారు. అయితే, తన కుమారుడి మరణంపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని భావించిన పూర్ణిమారావు న్యాయపోరాటం ప్రారంభించారు. ఇందుకోసం ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకొని రెండోసారి శవపరీక్ష చేయించారు. రెండో నివేదికలో పోలీసులు చెప్పిన ఫలితాలకు భిన్నంగా ఉన్న విషయాలు బయటపడ్డాయని ఆమె తెలిపారు.

వివరాలు 

సీసీటీవీ ఫుటేజీ పరిశీలనపై పోలీసుల నిర్లక్ష్యం? 

పోలీసులు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజీలో అనుమానాస్పదమైన విషయాలు ఏమీ లేవని తెలిపారు. అయితే, ఆ దృశ్యాల కోసం అపార్టుమెంట్ సిబ్బందిని ఎవరూ సంప్రదించలేదని తేలిందని పూర్ణిమారావు పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ స్పందన సుచిర్‌ మృతిపై ఓపెన్‌ఏఐ సైతం స్పందించింది. అతని మరణం తమను కలచివేసిందని, అతని కుటుంబానికి సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ కేసు పై ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయని, నిజమైన న్యాయం జరిగే వరకు తాను పోరాడుతానని పూర్ణిమారావు స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పూర్ణిమారావు చేసిన ట్వీట్