Houthi vs Saudi: హౌతీలు ఇస్లాంకు శత్రువులు.. సౌదీకి పాక్ అండగా ఉండాలి: అష్రఫీ
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా, హౌతీల మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మతగురువు, ఉలేమా కౌన్సిల్ చైర్మన్ హఫీజ్ తాహిర్ అష్రఫీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ సంస్థను టెర్రరిస్టు సంస్థగా అభివర్ణించారు. హౌతీలకు ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులను ఎదుర్కొనే విషయంలో ముస్లిం దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్.. సౌదీకి అండగా నిలవాలని అష్రఫీ పిలుపునిచ్చారు. మదీనాలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
హౌతీలపై తీవ్ర ఆరోపణలు
హౌతీలు ఇస్లాంకు సంబంధం లేని టెర్రరిస్టులని అష్రఫీ ఆరోపించారు.
సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు వారు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.
మక్కా, మదీనాలపై దాడులకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
యెమెన్ ప్రజలకు సౌదీ అరేబియా భారీ స్థాయిలో సహాయం అందించినప్పటికీ.. హౌతీలు ఆ సహాయాన్ని తిరస్కరించారని అష్రఫీ ఆరోపించారు.
సౌదీ భద్రత, ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించే చర్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
పాక్ మొత్తం సౌదీకి అండగా ఉంటుందన్న అష్రఫీ
సౌదీఅరేబియాకు పాకిస్తాన్ మద్దతు కొనసాగుతుందని అష్రఫీ స్పష్టం చేశారు.
పాక్ ప్రభుత్వం మాత్రమే కాకుండా దేశ సైన్యం,మతపెద్దలు, ప్రజలు కూడా సౌదీకి అండగా నిలుస్తారని ఆయన చెప్పారు.
ఇటీవల సౌదీఅరేబియాపై హౌతీల దాడులు తీవ్రతరం కావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
ఇదే సమయంలో పాకిస్తాన్,సౌదీ అరేబియా,టర్కీ మధ్య కుదిరిన ''మక్కా జాయింట్ అగ్రిమెంట్''పై కూడా చర్చ జరుగుతోంది.
ఈ ఒప్పందం నేపథ్యంలో సౌదీకి ఆయా దేశాలు అందించిన మద్దతు ప్రధానంగా ప్రకటనలకే పరిమితమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మతగురువు హఫీజ్ తాహిర్ అష్రఫీ సౌదీకి బహిరంగంగా మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యంగా హౌతీలను టెర్రరిస్టులుగా పేర్కొంటూ,సౌదీకి మద్దతుగా ముస్లింలు,పాకిస్తాన్ నిలవాలని ఆయన చేసిన పిలుపు చర్చనీయాంశంగా మారింది.