Justin Trudeau: టారిఫ్‌ల యుద్ధం.. ట్రంప్ నిర్ణయంపై ట్రూడో ఘాటు వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోపై విధించిన 25 శాతం టారిఫ్‌లపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా స్పందించారు.
బలవంతంగా టారిఫ్‌లు అమలు చేయాలని ట్రంప్ అనుకుంటే, అది రెండు దేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ట్రంప్ నిర్ణయాన్ని ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా టారిఫ్‌లు విధించడం తమపై ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా ట్రూడో అభివర్ణించారు.
ఈ చర్యలు కెనడా ఆర్థిక వ్యవస్థనే కాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయని అన్నారు. రెండు దేశాల భద్రతకు ఇది నష్టమేనని పేర్కొన్నారు.
Details
25శాతం టారీఫ్ లు అమల్లోకి!
కెనడా ఉక్కు, అల్యూమినియం, కీలకమైన ఖనిజాలు అమెరికాకు ఎంతో అవసరమైనవని, వీటిపై టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు.
ట్రంప్ తన వైట్ హౌస్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ, నేటి నుంచే కెనడా, మెక్సికోపై 25 శాతం టారిఫ్‌లు అమలులోకి వస్తాయని ప్రకటించారు.
ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే చమురు టారిఫ్‌ల జాబితాలో చేర్చాలా వద్దా అనే దానిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం చమురు ధర సరైన స్థాయిలో ఉంటే టారిఫ్‌ల అవసరం లేదని పేర్కొన్నారు.
Details
మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు సబ్సిడీ
టారిఫ్ విధింపునకు పలు కారణాలు ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు.
ముఖ్యంగా ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ అధికంగా ఉంటోందని, వాణిజ్య లోటు కూడా భారీగా ఉందని తెలిపారు.
కెనడా, మెక్సికో అమెరికాతో అన్యాయంగా వ్యవహరించాయని ఆరోపించారు.
ప్రస్తుతం అమెరికా కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు సబ్సిడీ అందిస్తోందని వివరించారు.