Loading...
Nepal: నేపాల్‌లో ఉద్రిక్తత.. అల్లర్లతో సరిహద్దుల్లో భారత్ అప్రమత్తం!
నేపాల్‌లో ఉద్రిక్తత.. అల్లర్లతో సరిహద్దుల్లో భారత్ అప్రమత్తం!

Nepal: నేపాల్‌లో ఉద్రిక్తత.. అల్లర్లతో సరిహద్దుల్లో భారత్ అప్రమత్తం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో బిహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. లౌడ్‌స్పీకర్ వివాదంతో చెలరేగిన ఘర్షణలు నేపాల్‌లోని కోషి ప్రావిన్స్‌లో సున్సారీ జిల్లాలో గత వారాంతంలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్‌స్పీకర్ల వినియోగంపై తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత నేపాల్‌లోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

వివరాలు

కర్ఫ్యూ.. అదనపు బలగాల మోహరింపు

పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి నేపాల్ అధికారులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు అమలు చేస్తూ అదనపు భద్రతా బలగాలను మోహరించారు.

జులై 26న జరిగిన ఘర్షణలు, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

అలాగే భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మధేశ్ ప్రావిన్స్‌లోని సప్తరీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జులై 31 నుంచి నిరవధిక కర్ఫ్యూ అమల్లో ఉంది.

వివరాలు

భారత్-నేపాల్ సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రత

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బిహార్‌లోని మధుబనీ జిల్లా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.

ప్రధాన రహదారులతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా వాహనాల తనిఖీలు, గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అదేవిధంగా సరిహద్దు పోలీస్ స్టేషన్ల వద్ద అదనపు భద్రతా బలగాలను మోహరించారు.

ప్రజలకు పోలీసుల సూచనలు

పరిస్థితుల దృష్ట్యా పుకార్లను నమ్మవద్దని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అలాగే ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ADVERTISEMENT