Page Loader
Israel-Hamas-War: రాఫా పై దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
రాఫా పై దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్

Israel-Hamas-War: రాఫా పై దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్

వ్రాసిన వారు Stalin
Apr 24, 2024
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా(Middle East)లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాజా(Gaza)పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. ఈ వారంలోనే గాజాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌కు సమీపంలో కొత్త టెంట్‌ లు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపించడంతో ఇజ్రాయెల్ కూడా రఫా నగరంపై దాడికి సిద్ధమవుతోంది. హమాస్‌ను నిర్మూలించే లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 34,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పౌరులను ఎన్ క్లేవ్ కు ఉత్తరం వైపు తరలి వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్​ సైన్యం ఆదేశించింది. ఇప్పటికే గాజా స్ట్రిప్ ఉత్తరం వైపు ఉన్న బీట్ హనౌన్ ను ఆక్రమించుకున్నాయి. అయితే అవి ఇంకా గాజాలోకి ప్రవేశించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైమానిక దాడిలో 34,000 మంది పాలస్తీనియన్లు మృతి