తదుపరి వార్తా కథనం
Mexico: ఘోర విషాదం.. సూపర్ మార్కెట్‌లో పేలుడు, 23 మంది దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 02, 2025
09:48 am
ఈ వార్తాకథనం ఏంటి
మెక్సికోలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఘోర పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ, సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. అధికారులు ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.