Page Loader
Pakistan airbase attack: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి 
పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి

Pakistan airbase attack: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి 

వ్రాసిన వారు Stalin
Nov 04, 2023
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి జరిగింది. మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌లోకి ఆయుధాలతో పలువురు ఉగ్రవాదులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఈ ఉగ్రదాడికి తెహ్రీక్-ఏ-జిహాద్ బాధ్యత వహించింది. ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ ఆర్మీ పేర్కొంది. పాకిస్థాన్ వైమానిక దళ స్థావరంపై దాడి చేయడం ద్వారా ఉగ్రవాదులు పాకిస్థాన్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఇప్పటికే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన పాక్ పరిస్థితి ఇప్పుడు తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు అయ్యింది. పాక్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడం పాక్ కు పెద్ద దెబ్బ అని చెప్పాలి.

పాక్

నిన్న పాక్ సైనికుల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి.. 14 మంది మృతి

ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులకు, పాకిస్థాన్ ఆర్మీకి మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఎయిర్ బేస్ లోపల భారీ మంటలు చెలరేగాయి. దాడికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎయిర్‌బేస్‌‌పై దాడికి ఒకరోజు ముందు, నవంబర్ 3న, బలూచిస్తాన్‌లోని గ్వాదర్‌లో పాకిస్థాన్ భద్రతా దళాల వాహనాలపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ దాడిలో 14మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. పాకిస్థాన్ సైనికుల కాన్వాయ్ గ్వాదర్ జిల్లాలోని పస్ని నుంచి ఒర్మారా వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసిన సమయంలో.. ఆయన పార్టీ మద్దతుదారులు మియాన్‌వలీ ఎయిర్‌బేస్‌పై దాడి చేశారు. ఈ సమయంలో, పార్టీ మద్దతుదారులు ఎయిర్‌బేస్ వెలుపల పార్క్ చేసిన విమానానికి నిప్పు పెట్టారు.