LOADING...
Border clash: మరోసారి కంబోడియా-థాయిలాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. కంబోడియాపై థాయి వైమానిక దాడులతో టెన్షన్
కంబోడియాపై థాయి వైమానిక దాడులు

Border clash: మరోసారి కంబోడియా-థాయిలాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. కంబోడియాపై థాయి వైమానిక దాడులతో టెన్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కంబోడియా - థాయిలాండ్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. కొద్ది కాలం క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరి పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే, తాజాగా అనుకోకుండా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. కంబోడియాపై థాయ్‌లాండ్ వైమానిక దాడులు చేపట్టడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు ప్రాంతంలో వైమానిక దాడులు ప్రారంభించినట్లు థాయ్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ వింథాయ్ సువారీ సోమవారం వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని పరస్పరం నిందలు మోపుకున్నాయి.

వివరాలు 

డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి

ప్రస్తుతం థాయ్‌లాండ్ కంబోడియాపై దాడులు కొనసాగిస్తుండగా, పరిస్థితులు ఇక ఏ దిశగా మలుపు తిరుగుతాయో అనేది స్పష్టత లేని స్థితి నెలకొంది. ఇక గత జూలై నెలలో థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో ఐదు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు అదుపు తప్పడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని శాంతి చర్చలకు నాంది పలికారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిగా వ్యవహరించడంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అనంతరం అక్టోబర్ నెలలో కౌలాలంపూర్ లో ట్రంప్ సమక్షంలో రెండు దేశాలు అధికారికంగా కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ తర్వాత పరిస్థితులు కొంతకాలం సద్దుమణిగినట్లు కనిపించాయి.అయితే,ఇప్పుడు మళ్లీ అకస్మాత్తుగా ఉద్రిక్తతలు తలెత్తడంతో ఆందోళన నెలకొంది.

Advertisement