LOADING...
Thailand-Cambodia: థాయిలాండ్-కంబోడియా సరిహద్దు ఉద్రిక్తతలు: 14 మంది మృతి,లక్ష మందికిపైగా నిరాశ్రయులు 
14 మంది మృతి,లక్ష మందికిపైగా నిరాశ్రయులు

Thailand-Cambodia: థాయిలాండ్-కంబోడియా సరిహద్దు ఉద్రిక్తతలు: 14 మంది మృతి,లక్ష మందికిపైగా నిరాశ్రయులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్- కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, సుమారు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలంతా భయభ్రాంతులతో జీవితం గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఘర్షణలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. గురువారం రోజు థాయ్‌, కంబోడియా సైనిక దళాల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. సరిహద్దు వద్ద ఫైరింగ్ జరగగా, ఈ సంఘటన టా మోన్ థోమ్‌ అనే ప్రాచీన ఆలయం వద్ద జరిగింది. ఈ ఆలయం థాయ్‌ల్యాండ్‌లోని సురిన్‌ ప్రావిన్స్‌ పరిధిలో ఉంది. ఈ ఫైరింగ్‌తో రెండు దేశాల్లోనూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

వివరాలు 

ప్రభుత్వ ఆసుపత్రుపై షెల్లింగ్

ఈ ఘటనపై స్పందించిన థాయిలాండ్ ఆరోగ్య మంత్రి.. సురిన్ ప్రాంతంలోని ఓ ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రుపై షెల్లింగ్ జరిపినట్లు తెలిపారు. దీనిని యుద్ధ నేరంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో ఈ రకమైన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో ఇదే సరిహద్దు వివాదం వల్ల థాయ్‌లాండ్ ప్రధాని ఏకంగా పదవిని కోల్పోయారు.

వివరాలు 

ల్యాండ్‌మైన్‌ల వివాదం తెరపైకి.. 

ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ల్యాండ్‌మైన్‌లు ప్రధాన వివాదాస్పద అంశంగా మారాయి. వివాదాస్పద ప్రాంతాల్లో ల్యాండ్‌మైన్‌లు పేలిన సంఘటనలు నమోదవుతున్నాయి. జూలై 16వ తేదీన థాయ్ సైనికుడు పెట్రోలింగ్ చేస్తుండగా ల్యాండ్‌మైన్ పేలడంతో అతడు తన కాలు కోల్పోయాడు. ఈ ఘటన తమ భూభాగంలో జరిగిందని థాయ్ సైనికులు చెబుతుండగా, కంబోడియా మాత్రం ఇది ప్రీహ్ విహార్ ఆలయం పరిసరాల్లోనే చోటు చేసుకుందని వాదిస్తోంది. వారం రోజుల కిందట కూడా ఇలాంటి ఘర్షణలు నమోదయ్యాయి.

వివరాలు 

ల్యాండ్‌మైన్‌ల వివాదం తెరపైకి.. 

ఇంకా, పినోమ్ పెన్‌ సైనికులు రష్యా నుంచి కొనుగోలు చేసిన ల్యాండ్‌మైన్‌లను వివాదాస్పద భూభాగాల్లో పాతినట్లు థాయ్‌లాండ్ ఆరోపించింది. దీనిని కంబోడియా ఖండించింది. థాయ్ సైనికులే ఒప్పందంలోని గస్తీ మార్గాలను దాటి ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని కంబోడియా వాదిస్తోంది. తాజా ఘర్షణల నేపథ్యంలో థాయ్ వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. ఈ విమానాలు ట మోన్ థోమ్ ఆలయం ప్రాంతంలో బాంబులు వేసినట్లు సమాచారం. కంబోడియా సైనికులు ప్రతిదాడులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.

వివరాలు 

సరిహద్దు వివాదం ఇలా.. 

ఇరు దేశాల మధ్య సరిహద్దు 817 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.ఇది 1907లో ఫ్రెంచ్ పాలనలో రూపొందించిన మ్యాప్‌ల ఆధారంగా ఏర్పడింది. అయినా,శాంతియుతంగా కలిసి జీవిస్తున్నా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆలయాలు గల ప్రాంతాలపై ఇరుదేశాలూ పట్టుబట్టడమే ఈ వివాదానికి మూలకారణంగా మారింది. డాంగ్రెక్ పర్వతాల శిఖరం థాయ్‌లాండ్‌కు సన్నిహితంగా ఉన్నా, అందులోని ప్రీహ్ విహార్ ఆలయం కంబోడియాకు చెందిందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పింది. థాయ్‌లాండ్ ఈ తీర్పును అంగీకరించినా, ఆలయాన్ని చుట్టుముట్టిన ప్రాంతాలపై కల్లోలాలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

సరిహద్దు వివాదం ఇలా.. 

ఈ ఆలయాన్ని 2008లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. దీనిని థాయ్‌లాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. తర్వాత ఐసీజే మరో తీర్పు ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. కంబోడియాకు సార్వభౌమాధికారం ఉందని స్పష్టం చేస్తూ, థాయ్ సైనికులు వెనక్కు తగ్గాలని పేర్కొంది. థాయ్‌లాండ్ ఈ తీర్పును అంగీకరించినా, మ్యాప్‌లు, మిలిటరీ గస్తీలపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. సురిన్ ప్రావిన్స్‌లోని ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడా ఈ వివాదంలో భాగమయ్యాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలో ఓ కంబోడియా సైనికుడు ప్రాణాలు కోల్పోవడంతో, పినోమ్ పెన్‌లో జాతీయత భావనలు మరింత ముదిరిపోయాయి.

వివరాలు 

వివాదంతో పదవిని కోల్పోయిన యువ ప్రధాని 

థాయ్‌లాండ్ యువ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా ఈ సరిహద్దు వివాదం కారణంగానే పదవిని కోల్పోయారు. అధికారం చేపట్టిన పదినెలలకే ఆమె పదవీగండానికి గురయ్యారు. కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో 'అంకుల్' అంటూ ఆయనను పిలిచిన షినవత్రా, దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఈ కాల్‌లో తనకు ఆర్మీ కమాండర్ వ్యతిరేకంగా ఉన్నారని కూడా తెలిపారు. అయితే ఈ సంభాషణ లీక్ కావడంతో తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్న ఆమెకు, ఆమెకు చెందిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కన్జర్వేటివ్ భూమ్‌జాయ్‌థాయ్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. ప్రధాని ఫోన్ సంభాషణతో దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఈ వివాదమే ఆమె పదవికి ముగింపు పలికింది.