
Turkish Airlines:టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణీకుడు మృతి.. మృతదేహం మాయం..!
ఈ వార్తాకథనం ఏంటి
శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నతుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయాడు. అయితే, విమానం ల్యాండ్ అయిన తర్వాత అతడి మృతదేహం కనిపించకపోవడం కలకలం రేపింది. ఈ ఘటన 13వ తేదీన చోటుచేసుకుంది. ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకి వెళ్లే TK79 అనే తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం,విధిగా ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వైద్య సహాయం అందేలోపే అతడు మరణించాడు. ఈ ఘటనతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. తొలుత ఐస్లాండ్‌లోని కెఫ్లావిక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాలని భావించినా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరికి షికాగో ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి అక్కడ అత్యవసర ల్యాండింగ్ చేశారు.
వివరాలు
మృతదేహం అందలేదు: నటాలియా డెరెవ్యానీ
విమానాన్ని భద్రంగా ల్యాండ్ చేసిన తర్వాత,మృతదేహాన్ని షికాగోలోని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్టు సమాచారం. మిగిలిన ప్రయాణికుల ప్రయాణంలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసి పంపారు. అయితే తుర్కిష్ ఎయిర్‌లైన్స్ నుంచి తమ కార్యాలయానికి ఎలాంటి మృతదేహం అందలేదని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయ ప్రతినిధి నటాలియా డెరెవ్యానీ వెల్లడించారు. దీంతో, విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న దానిపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా మృతుడి గుర్తింపు,ఆయన వ్యక్తిగత వివరాలపై తుర్కిష్ ఎయిర్‌లైన్స్ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మృతదేహం ఆచూకీ లేకపోవడం వివిధ అనుమానాలకు దారి తీస్తోంది. ఇక,ఆ ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు ఏమీ కూడా విమానయాన సంస్థ వెల్లడించలేదు.