
Thailand: థాయిలాండ్‌లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత.. 120 రోజుల్లో అమల్లోకి
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్ స్వలింగ జంటలకు చట్టబద్ధమైన వివాహ హక్కులను కల్పిస్తూ 'వివాహ సమానత్వ బిల్లు'పై అధికారికంగా సంతకం చేశారు.
ఈ చట్టం రాయల్ గెజిట్‌లో ప్రచురించారు. తద్వారా ఈ చట్టం 120 రోజుల్లో అమలులోకి రానుంది.
ఈ చట్టం అమల్లోకి వస్తే థాయిలాండ్ ఆసియాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మూడవ దేశంగా నిలవనుంది.
తైవాన్, నేపాల్ తర్వాత రిజిస్ట్రేషన్లు 2025 జనవరి నుండి ప్రారంభమవుతాయి.
కొత్తగా ఆమోదించబడిన ఈ చట్టం, స్వలింగ జంటలకు అన్ని చట్టపరమైన, ఆర్థిక, వైద్య హక్కులను కల్పించింది.
Details
స్వలింగ జంటలకు పూర్తి హక్కులు
ఈ చట్టాన్ని ఏప్రిల్, జూన్‌లో వరుసగా ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదించాయి.
ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని పురస్కరించుకుని, ప్రధాన మంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రా 'అందరి ప్రేమకు అభినందనలు' అంటూ ఎక్స్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు.
స్వలింగ వివాహ హక్కుల కోసం సంప్రదాయవాద ప్రభుత్వాలు, సంస్థల నుండి వచ్చిన ప్రతిఘటనలను ఎదుర్కొంటూ వచ్చారు.