
Shinawatra: లీక్ అయిన ఫోన్ కాల్.. థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాను సస్పెండ్ చేసిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రకు అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమెను పదవి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ జూలై 1న సంచలనాత్మక ఆదేశాలు విడుదల చేసింది. కంబోడియాతో ఉన్న సరిహద్దు వివాదానికి సంబంధించి ఆమె వ్యవహారశైలి పై వచ్చిన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే,థాయిలాండ్-కంబోడియాల మధ్య గత కొన్ని నెలలుగా సరిహద్దు సంబంధిత ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల మే నెలలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.ఆ ఘటనలో ఒక కంబోడియా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈపరిస్థితుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రధాని షినవత్ర,కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆసంభాషణ రికార్డు లీక్ కావడం వల్ల పెద్ద వివాదం మొదలైంది.
వివరాలు
థాయిలాండ్‌లో గందరగోళంగా రాజకీయ పరిస్థితి
అందులో షినవత్ర,హున్ సేన్‌ను'అంకుల్' అని పిలవడం,థాయ్ సైన్యంలో ఉన్న ఓ ఉన్నతాధికారిని 'తన ప్రత్యర్థి'గా పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈఅంశంపై పలువురు కన్సర్వేటివ్ సభ్యులు రాజ్యాంగ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కంబోడియా పక్షాన తలొగ్గిన చర్యతో ప్రధాని దేశ సైన్యాన్ని బలహీనపరిచారని,మంత్రిగా ఉండాల్సిన నైతిక విలువలు,నిజాయితీకి ఆమె భంగం కలిగించారనే ఆరోపణలు వారు చేశారు. ఈకేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం,తుది తీర్పు వెలువడే వరకు ఆమెను అధికార బాధ్యతల నుంచి తప్పించాలని 7-2 మెజారిటీతో తీర్పు చెప్పింది. "జులై 1 నుంచి కేసు తీర్పు వచ్చే వరకూ ప్రధాని తన పదవిలో కొనసాగకూడదు"అని కోర్టు స్పష్టం చేసింది. ఈనిర్ణయంతో థాయిలాండ్‌లో రాజకీయపరిస్థితి గందరగోళంగా మారింది.ప్రధానమంత్రి సస్పెన్షన్‌తో దేశంలో రాజకీయ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.