
Thaksin Shinawatra: మాజీ ప్రధానికి షాక్.. శిక్షను సరిగ్గా అనుభవించలేదని.. మళ్లీ జైలు శిక్ష విధింపు
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ మాజీ ప్రధాని థక్సిన్ షినవత్ర (Thaksin Shinawatra) కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో విధించిన జైలు శిక్షను సరైన విధంగా పూర్తి చేయలేదని, ఈ కారణంతో మరోసారి ఏడాది జైలు శిక్ష విధించాలని ఇటీవల తీర్పు వెలువరించింది.
వివరాలు
అసలేమయ్యిందంటే?
2006లో సైనిక తిరుగుబాటుతో థాయ్‌లాండ్ మాజీ ప్రధాని థక్సిన్ షినవత్రను బలవంతంగా పదవీ నుంచి తొలగించారు. 2008లో రాజకీయ ఉద్దేశ్యంతో చేసిన ఆరోపణల ప్రకారం, ఆయనకు జైలు శిక్ష విధించడంతో థక్సిన్ దేశం నుంచి పారిపోయారు. తరువాతి 15 సంవత్సరాల పాటు విదేశాల్లోనే గడిపారు. చివరికి 2023లో ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. సుప్రీంకోర్టు పక్షాన గతంలో నమోదు చేసిన కేసులో ఆయనకు మొత్తం 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఆరోగ్య కారణాలను ఆధారంగా చూపించి, రాజు ప్రత్యేక అనుమతితో శిక్షను ఏడాది వరకు తగ్గించారు.
వివరాలు
షినవత్రను పదవి నుంచి తొలగించిన రాజ్యాంగ న్యాయస్థానం
శిక్ష తగ్గించినప్పటికీ, అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి థక్సిన్ ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించలేదని చర్చలు మొదలయ్యాయి. ప్రజల్లో ఆయన ఆరోగ్య స్థితి నిజమా లేక తప్పుడు ఆధారాలతో శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యాపించాయి. ఈ అనుమానాల వేళ అప్పట్లో సరిగ్గా శిక్ష అనుభవించని కారణంగా థక్సిన్‌కు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ.. సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇటీవల, కంబోడియా సెనెట్ అధ్యక్షుడు హన్‌సేన్‌తో ఫోన్‌లో మాట్లాడిన నేపథ్యంలో, థాయ్‌లాండ్ ప్రధాని, థక్సిన్ కుమార్తె షినవత్ర (Paetongtarn Shinawatra) రాజకీయ వివాదంలో పడి, రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను పదవీ నుంచి తొలగించింది.