LOADING...
AI: సైబర్‌ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్‌ కాల్‌
సైబర్‌ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్‌ కాల్‌

AI: సైబర్‌ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్‌ కాల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేథస్సు (Artificial Intelligence) రోజురోజు అభివృద్ధి చెందుతూ అనేక రంగాలలో వినియోగించబడుతోంది. అయితే ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఏఐను ఉపయోగించి ప్రజల నుంచి ఆర్ధిక లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా సైబర్ మాయగాళ్లు ఏఐ ఫోన్ కాల్‌ను ఉపయోగించి దేశ ప్రధానిని (థాయ్‌లాండ్ ప్రధాని) మోసం చేయాలని యత్నించారు. సైబర్ నేరగాళ్లు ఏఐ సాయంతో పేటోంగ్టార్న్‌ షినవత్రా (PM Paetongtarn Shinawatra), థాయిలాండ్ ప్రధానిని ఫోన్‌లో మోసం చేయడానికి ప్రయత్నించారు.

వివరాలు 

సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది

ఏఐ సహాయంతో సైబర్‌ నేరస్థులు తనకు ఫోన్‌కాల్‌ చేసి.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ లీడర్ గొంతుతో మాట్లాడి తనను నమ్మించడానికి ప్రయత్నించారని థాయ్‌లాండ్‌ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్‌ షినవత్రా పేర్కొన్నారు. అయితే, ఆమె ఈ మోసాన్ని వెంటనే గుర్తించగలిగింది. అయితే, ప్రధాని పదవిలో ఉన్న ఆమెకు ఇలాంటి కాల్ వస్తే, సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆందోళనను వ్యక్తం చేశారు. ఆమె తెలిపిన ప్రకారం, "ఏఐతో నేరాలు పెరిగిపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని" పేటోంగ్టార్న్‌ అన్నారు. తనకు వచ్చిన కాల్ లో, "ఎలా ఉన్నారు? మీరు నాకు సహకరించాలని అనుకుంటున్నాను" అనే మాటలు ఒక స్పష్టమైన గొంతుతో వినిపించాయి. మొదట వాయిస్ మెసేజ్ వలయంగా వచ్చింది.

వివరాలు 

ఫోన్ కాల్ ఎక్కడినుంచి వచ్చిందనే దర్యాప్తు

తనవంతుగా తిరిగి కాల్ చేయగా, అది కట్ అయ్యిందని ఆమె వివరించారు. అనంతరం, "ఆసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్"లోని ఇతర దేశాలన్నీ విరాళాలు ఇచ్చినప్పటికీ, థాయ్‌లాండ్ మాత్రం ఇవ్వలేదని, వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరొక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఈ సమయంలో, పేటోంగ్టార్న్‌ అవాక్కయ్యారని చెప్పారు. అయితే, ఈ ఫోన్ కాల్ ఎక్కడినుంచి వచ్చిందనే దర్యాప్తు జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుండి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.