Plane crashes: ప్రపంచంలో అత్యంత విషాదకర 10 విమాన ప్రమాదాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలో జరిగిన ఒక విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేకెత్తించింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. పక్షి ఢీ కొట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఇంతకుముందు కూడా వివిధ కారణాలతో ఎన్నో విమానాలు కుప్పకూలాయి.
కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కూలితే, మరికొన్ని క్షిపణుల దాడులతో వందల మంది ప్రాణాలను బలిగొన్నాయి.
1) రన్‌వేపై రెండు విమనాలు ఢీ
1997 మార్చి 27న స్పెయిన్‌లోని టెనిరీఫ్ ద్వీపం వద్ద లాస్ రోడోస్ విమానాశ్రయంలో రెండు బోయింగ్ 747 విమానాలు రన్‌వేపై ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో 583 మంది మరణించారు. ఈ ఘటన విమానయాన చరిత్రలో అత్యంత విషాదకరమైనదిగా నిలిచింది.
Details
2. సాంకేతిక సమస్యతో ప్రమాదం
1985 ఆగస్టు 12న జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 747 టోక్యో నుంచి ఒసాకాకు బయలుదేరిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో తకామగారా పర్వతాల్లో విమానం కుప్పకూలి 520 మంది మరణించారు.
3. భారత్‌లో జరిగిన అత్యంత పెద్ద ప్రమాదం
1996 నవంబర్ 12న ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసిన సౌదీ అరేబియా విమానం, కజక్‌స్థాన్ విమానం హరియాణాలోని చర్కీ దాద్రి వద్ద 14 వేల అడుగుల ఎత్తులో గగనతలంలో ఢీకొనడంతో 349 మంది మరణించారు.
భారత్‌లో జరిగిన ఇది అత్యంత పెద్ద విమాన ప్రమాదం.
Details
4. తలుపు ధ్వంసం కావడంతో పేలుడు
1974 మార్చి 3న పారిస్ ఓర్లే విమానాశ్రయం నుంచి బయల్దేరిన టర్కీ ఎయిర్‌లైన్స్ విమానం 12 వేల అడుగుల ఎత్తులో కార్గో తలుపు ధ్వంసమై పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో 346 మంది మరణించారు.
5. 'కనిష్క'పై ఉగ్రదాడి
1985 జూన్ 23న మాంట్రియల్ నుంచి దిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం 'కనిష్క'లో ఖలిస్థాన్ ఉగ్రవాదులు బాంబు పెట్టారు.
అట్లాంటిక్ మహాసముద్రం పైగా ప్రయాణిస్తున్న సమయంలో బాంబు పేలి 329 మంది మరణించారు.
6. పొగతో ఊపిరాడక
1980 ఆగస్టు 19న కరాచీ నుంచి జెడ్డాకు వెళ్తున్న సౌదీ విమానం రియాద్‌లో ఆగిన తర్వాత కార్గో విభాగంలో మంటలు చెలరేగి, ఊపిరాడక 301 మంది ప్రాణాలు కోల్పోయారు.
Details
7. క్షిపణి తాకడంతో
2014 జులై 17న ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపుర్‌కు వెళ్తున్న విమానం ఉక్రెయిన్ భూభాగంలో రష్యా మద్దతున్న మిలిటెంట్లు ప్రయోగించిన క్షిపణితో కూలిపోయింది.
ఈ ఘటనలో 298 మంది మరణించారు.
8. యుద్ధవిమానమని భావించి..!
1988 జులై 3న టెహ్రాన్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న ఇరాన్ విమానాన్ని అమెరికా యుద్ధ వాహక నౌక పొరపాటున క్షిపణి ప్రయోగించి కూల్చింది. ఈ ప్రమాదంలో 290 మంది మరణించారు.
Details
9. బలమైన గాలుల కారణంగా
2003 ఫిబ్రవరి 19న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళాలతో ప్రయాణిస్తున్న ఈ విమానం బలమైన గాలుల కారణంగా కర్మెన్ ప్రాంతంలో కుప్పకూలింది.
ఈ ఘటనలో 275 మంది దుర్మరణం చెందారు.
10. ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో
1979 మే 25న షికాగో నుంచి బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో కుప్పకూలి ముక్కలైపోయింది. ఈ ప్రమాదంలో 273 మంది ప్రాణాలు కోల్పోయారు.