NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు
    నేపాల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

    దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 06, 2023
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌కు వ్యాపారవేత్తపై నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.

    తనను ప్రధానిని చేసేందుకు నేపాల్ లో స్థిరపడిన భారత వ్యాపారి సర్దార్ ప్రీతమ్ సింగ్ గతంలో ప్రయత్నాలు చేశారని చేసిన కామెంట్స్‌పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

    ఖాట్మండులో స్థిరపడిన ప్రముఖ భారత వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్ జీవత కథపై రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని హజరయ్యారు.

    ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేపాల్-భారత్ సంబంధాలను మెరుగుపరచడంలో సర్దార్ ప్రీతమ్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఓ సారి తనను ప్రధానిగా చేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

    Details

    తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ప్రధాని

    సర్దార్ ప్రీతమ్ అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి తనను ప్రధానిని చేసేందుకు ఖాట్మాండులోని రాజకీయ నేతలతో పలు ధపాలుగా చర్చలు కూడా జరిపారని నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దహల్ ప్రచండ చెప్పారు.

    ఈ వ్యాఖ్యలు కాస్తా నేపాల్ రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి.

    ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆప్ నేపాల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలపై ప్రధాని నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే ప్రధాని పదవి నుంచి వైదొలగాలని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలు దేశ స్వతంత్రత, మర్యాదకు భంగం కలిగించాయన్నారు.

    ఈ వ్యాఖ్యలపై ప్రచండ స్పందిస్తూ తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి వివాదం రేపుతున్నారని, పుస్తకంలో ప్రీతమ్ షింగ్ చెప్పిన వ్యాఖ్యలనే తాను చెప్పానని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేపాల్
    ప్రపంచం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    నేపాల్

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం విమానం
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి

    ప్రపంచం

    పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి ఆర్థిక శాఖ మంత్రి
    Spotify new feature : ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా.. ఆఫ్‌లైన్‌లో పాటలు వినొచ్చు! టెక్నాలజీ
    టెన్నిస్ చరిత్రలో రారాజు.. ఫ్రెంచ్ ఓపెన్ విజేత జొకోవిచ్ టెన్నిస్
    భార్యను భర్త కొట్టడాన్ని సమర్థించిన 80దేశాల్లో 25శాతం మంది ప్రజలు  ఐక్యరాజ్య సమితి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025