NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 
    భారతదేశం

    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Naveen Stalin
    June 01, 2023 | 05:56 pm 1 నిమి చదవండి
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయమంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

    నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భారత పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రచండ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇంధనం, కనెక్టివిటీ, వాణిజ్యంతో సహా పలు రంగాల్లో భారతదేశం-నేపాల్ దేశాల మధ్య సహకారం మరింత బలపడే విధంగా ఇద్దరు ప్రధానులు విస్తృత చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్-నేపాల్ సంబంధాలను హిమాలయ శిఖరాల ఎత్తులకు తీసుకెళ్లేందుకు తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని సూపర్‌హిట్‌గా మార్చేందుకు ప్రచండ, తాను ఈరోజు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ చెప్పారు.

    ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ప్రచండ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే

    నేపాల్ ప్రధాని తన నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం బుధవారం దిల్లీకి చేరుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ నాయకుడు ప్రచండ 2022లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత చేస్తున్న మొదటి ద్వైపాక్షిక విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఆసియాలో ప్రాంతంలో వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారతదేశానికి నేపాల్ చాలా ముఖ్యమైన భాగస్వామి. రెండు దేశాల ప్రజల మధ్య సరిహద్దు వివాహాలు నేపాల్- భారత్ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ దాదాపు 1,850 కి.మీ పైగా సరిహద్దును పంచుకుంటుంది. 1950 నాటి భారత్-నేపాల్ శాంతి, స్నేహ ఒప్పందం రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలకు పునాదిగా నిలిచింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    నేపాల్
    భారతదేశం
    తాజా వార్తలు

    నరేంద్ర మోదీ

    అమెరికాలో రాహుల్ గాంధీ బిజినెస్ మీటింగ్స్...పెగాసెస్ పై సంచలన వ్యాఖ్యలు  భారతదేశం
    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్  ప్రధాన మంత్రి
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్

    ప్రధాన మంత్రి

    Indian Economy: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. మోర్గాన్ స్టాన్లీ ప్రశంసలు భారతదేశం
    కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం  నేపాల్
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు ప్రభుత్వం

    నేపాల్

    నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం; కూలిన భవనాలు భూకంపం
    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు భారతదేశం
    ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న ఆసిఫ్ షేక్ క్రికెట్
    దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు దిల్లీ

    భారతదేశం

    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  రైలు ప్రమాదం
    150 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసే యోచనలో ఎన్ఎంసీ  గుజరాత్
    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  దిల్లీ
    వీడియో: లేజర్ లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతున్న కొత్త పార్లమెంట్ బిల్డింగ్  భారతదేశం

    తాజా వార్తలు

    టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం  టీఎస్ఆర్టీసీ
    జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?  పాలు
    విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం  తెలంగాణ
    చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ  సమంత
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023