LOADING...
Journalist Zhang Zhan: కరోనా వ్యాప్తిని ప్రపంచానికి తెలిపిన జర్నలిస్ట్ ఇంకా జైలులోనే.. ఎందుకంటే? 
కరోనా వ్యాప్తిని ప్రపంచానికి తెలిపిన జర్నలిస్ట్ ఇంకా జైలులోనే.. ఎందుకంటే?

Journalist Zhang Zhan: కరోనా వ్యాప్తిని ప్రపంచానికి తెలిపిన జర్నలిస్ట్ ఇంకా జైలులోనే.. ఎందుకంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఆధునిక యుగంలో సంభవించిన అతి పెద్ద వినాశనాల్లో కరోనా వైరస్ ఒకటిగా ఉంటుంది. ఇది ఎక్కడో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెంది, లక్షలాది ప్రాణాలను బలిగొట్టింది. కరోనా గురించి మొదట చైనాలో నివేదించిన మహిళా జర్నలిస్టు పాపం, ఇప్పటికీ ఆ దేశంలో భారీ కష్టాలను అనుభవిస్తోంది. గత నాలుగేళ్లుగా ఆమె చైనా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Details

జాంగ్ ఝాన్ పాత్ర 

42 ఏళ్ల జాంగ్ ఝాన్ చైనాలో వ్యాప్తి చెందుతున్న ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను ప్రపంచానికి తెలియజేసింది. ఫోటోలు, వీడియోల ద్వారా వైరస్ వ్యాప్తిని బహిర్గతం చేయడం వల్ల చైనా ప్రభుత్వం ఆగ్రహించింది. మొదట ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇటీవల మరో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆమెపై హింసను ప్రేరేపించడం, అశాంతిని సృష్టించడం వంటి ఆరోపణలు మోపారు. 2020 డిసెంబర్‌లో కూడా ఇదే ఆరోపణలపై ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

Details

జైలు శిక్షలో ఘోర పరిస్థితులు 

మొదటి జైలు శిక్ష సమయంలో నిరాహార దీక్ష చేపట్టిన జాంగ్‌ను పోలీసులు చేతులు, కాళ్లను కట్టివేసి బలవంతంగా ట్యూబ్ ద్వారా ఆహారం తినిపించారు. ఆమెను 2024 మేలో విడుదల చేసినప్పటికీ, మూడు నెలల తర్వాత మళ్లీ అరెస్టు చేసి షాంఘై పుడాంగ్ డిటెన్షన్ సెంటర్‌కి తరలించారు. ఆ సమయంలో చైనా ప్రభుత్వం కోవిడ్ పరిస్థితిని సాధారణంగా ఉన్నట్టు నటించి ప్రపంచాన్ని మోసం చేసింది, కానీ జాంగ్ వీడియోలు, చిత్రాల ద్వారా వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి వెల్లడించారు.

Details

జర్నలిస్టుల పరిస్థితి చైనాలో ఎలా ఉందంటే?

చైనాలో జర్నలిస్టుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. RSF 2025లో 180 దేశాల వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో చైనా 178వ స్థానంలో ఉంది. RSF ప్రకారం, చైనాలో జర్నలిస్టులకు ప్రపంచంలోనే అతిపెద్ద జైలు ఉంది. ఈ దేశంలో సుమారు 124 మీడియా ఉద్యోగులు ఇప్పటికీ జైలులో గడుపుతున్నారు.