తాలిబన్ చేతిలో కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం
2021లో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబాన్ హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది. తాలిబాల్ హతమార్చిన వ్యక్తి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధం కలిగి ఉన్నాడని, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అయితే అతని వివరాలు, ఆపరేషన్ వివరాలు తాలిబాన్ వెల్లడించలేదు. ఈ ఆపరేషన్‌లో అమెరికా పాల్గొనలేదని నివేదికలు చెబుతున్నాయి.
ఐసీస్ దాడిలో 13మంది అమెరికా సైనికులు, 180 మంది పౌరులు మృతి
2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలు తరలిపోతున్న క్రమంలో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐఎస్ఐఎస్ ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 13మంది యుఎస్ సైనికులు, 180 మంది పౌరులను చనిపోయారు. తాలిబాన్ హతమార్చిన తీవ్రవాది ఐఎస్ఐఎస్-కే కోసం పని చేస్తున్నారు. 'కే' అనేది పూర్వపు పర్షియన్ సామ్రాజ్యం తూర్పు, ఈశాన్యంలోని ఖొరాసన్ ప్రావిన్స్‌ను సూచిస్తుంది. ఆఫ్ఘనిస్థాన్‍లో ఐఎస్ఐఎస్‌ను అణచివేసందుకు తాలిబాన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ ఐసిస్‌కు కేంద్రంగా మారిందని పెంటగాన్ విశ్వసిస్తోంది. అఫ్గనిస్థాన్‌లో దాదాపు 4,000 మంది ఐసీస్ సభ్యులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.