Page Loader
అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?.. పోలీసులు ఏం చెప్పారంటే!
అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?

అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?.. పోలీసులు ఏం చెప్పారంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2023
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం టీనేజర్‌గా ఉన్నప్పుడు అదృశ్యమైన ఓ వ్యక్తి గురించి సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి. కుమారుడిని బంధించిన తల్లి, అతడిని సెక్స్ బానిసగా ఉపయోగించుకుందని ఓ హక్కుల కార్యకర్త సంచలన ఆరోపణలు చేశాడు. బాధితుడి పేరు రూడీ ఫరియస్ అని స్థానిక హక్కుల కార్యకర్తను ఉటంకిస్తూ 'ఫాక్స్ న్యూస్' తెలిపింది. రూడీ తల్లి జేనీ శాంటన అతడికి అబద్ధం చెప్పి దాదాపు దశాబ్దం పాటు దాచి పెట్టి వేధింపులకు పాల్పడినట్లు కార్యకర్త క్వానెల్ ఎక్స్ తెలిపారు. ఆమె కుమారుడిని తండ్రి పాత్ర పోషించాలని కోరిందని క్వానెల్ పేర్కొన్నారు.

Details

ఆరోపణల్లో నిజం లేదన్న పోలీసులు

హోస్టన్ పోలీస్ విభాగం అధికారులు రూడీ ఫరియస్, అతడి తల్లి జేనీ శాంటలను కార్యకర్త సమక్షంలో ఓ హోటల్‌లో ప్రశ్నించినట్లు సమాచారం. 17 ఏళ్లు ఉన్నప్పుడు 2015లో ఫరియస్ అదృశ్యమయ్యాడని, ఆ తర్వాత కుమారుడిని బంధించిన తల్లి అతడిని సెక్స్ బానిసగా ఉపయోగించుకుందని క్వానెల్ తెలిపారు. ఈ ఆరోపణలు పోలీసులు కొట్టిపడేశారు. కుమారుడిపై తల్లి వేధింపులకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనిపై విచారించబోమని దర్యాప్తు అధికారులు జిల్లా అటార్నీకి తెలిపారు. అయితే కార్యకర్త మాత్రం ఈ ఆరోపణలు నిజమేనని వాదిస్తుండటం గమనార్హం.