Pakistan: పాకిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం.. భద్రతకు పెను ముప్పు
అత్యంత ప్రమాదక పర్యాటక ప్రాంతం పాకిస్థాన్‌లోని ఓ నగరం నిలిచింది. నిత్యమూ నేరం, హింస, తీవ్ర వాదుల బెదిరింపులతో పాకిస్థాన్‌లోని కరాచీ రెండో స్థానంలో ఉంది. జూలై 11 నాటి ఇందులో మూడు నగరాల జాబితాను డాన్ నివేదిక విడుదల చేసింది. వెనిజులాకు చెందిన కారకాస్ మొదటి స్థానంలో ఉండగా, కరాచీ రెండో స్థానం, మయన్మార్ చెందిన యాంగాన్ మూడో స్థానంలో ఉంది. ఈ నగరాల్లో వ్యక్తిగత భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.
60 అంతర్జాతీయ నగరాల పరిశీలన
అదే విధంగా కరాచీలో మౌలిక సదుపాయాల లభ్యత, నాణ్యత విషయాల్లో కూడా నాల్గో స్థానంలో నిలిచింది. ఈ జాబితా కోసం మొత్తం 60 అంతర్జాతీయ నగరాలను పరిశీలించినట్లు పేర్కొంది. అంతకుముందు 2017లో డాన్ విడుదల చేసిన నివేదకలో కరాచీ నగరం అతి తక్కువ సురక్షితమైన నగరాల్లో ఒకటిగా పేరుపొందింది. అంతకుముందు గురువారం పాకిస్తాన్‌లోని కరాచీ రక్షణ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య పరస్పరం కాల్పులు జరగ్గా, ఐదుగురు మరణించారు.