తదుపరి వార్తా కథనం

Narendra Modi : రష్యా పర్యటన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 27, 2024
09:24 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రష్యా పర్యటన ముగించుకొని తిరిగొచ్చిన విషయం తెలిసిందే.
అయితే వచ్చే నెలలో మోదీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇది మొదటిసారి.
ఇక గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో ఆయన జెలెన్ స్కీతో భేటీ అయ్యారు.
Details
శాంతి చర్చలకే మద్దతు : నరేంద్ర మోదీ
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
ఇరు దేశాల మధ్య యుద్ధం పరిష్కారం కాదని, శాంతి చర్చలకే తమ మద్దతు అని ఇప్పటికే మోదీ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాత ఈ పర్యటన చేయడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.