తదుపరి వార్తా కథనం

Mozambique: మొజాంబిక్‌లో ఘోర బోటు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 18, 2025
12:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
మొజాంబిక్‌లోని బెయిరా ఓడరేవు సమీపంలో శుక్రవారం సిబ్బంది బదిలీ ఆపరేషన్ల సమయంలో బోటు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ బోట్‌లో మొత్తం 14 మంది భారతీయ సిబ్బందితో పాటు మరికొందరు కూడా ఉన్నారని భారత హైకమిషన్ శనివారం ధృవీకరించింది. ప్రమాదాన్ని చూసి స్థానిక సిబ్బంది మిగిలిన వారిని రక్షించారు. గల్లంతైన వారిని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Details
అవసరమైన సాయమందిస్తాం
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. భారత హైకమిషన్ అధికారులు ఆసుపత్రిలో క్షతగాత్రులను సందర్శించి, మృతుల కుటుంబాలను సంప్రదించి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బోటు బోల్తా పడటానికి కారణాలు తెలియరాలేదు. హైకమిషన్ అత్యవసర పరిస్థితులలో సంప్రదించాల్సిన నంబర్లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.