Israeli Tourist Gang Rape: ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై ఘోర అత్యాచారం.. ముగ్గురికి మరణశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లాలో జరిగిన ఘోర ఘటనలో ఇజ్రాయెల్ పర్యాటకురి సహా ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించారు. కొప్పళ జిల్లా కోర్టు సోమవారం ఈ తీర్పును వెలువరించింది. ఈ ఘటన గతేడాది మార్చ్‌లో తుంగభద్ర ఎడమకాలువ సమీపంలో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన 27 సంవత్సరాల మహిళ, అమెరికాకు చెందిన డేనియల్ (23), నాసిక్‌కు చెందిన పంకజ్ (43), ఒడిశాకు చెందిన డిబాస్ (42) ఆనెగుందిలోని ఒక హోంస్టేలో బసించారు. ఘటనా సమయంలో రాత్రి సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద హోంస్టే నిర్వాహకురాలితో పాటు పర్యాటకులు ఒక సంగీత కార్యక్రమం నిర్వహించారు.
Details
ఇద్దరు మహిళలపై అత్యాచారం
ఆ సమయంలో మద్యమత్తులో ముగ్గురు వ్యక్తులు వచ్చి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో వారు అక్కడ ఉన్న ఇద్దరు మహిళలపై అసభ్యకర ప్రవర్తన చూపించారు. ఈ ఘటనలపై డేనియల్, పంకజ్, డిబాస్ అడ్డుకున్నారు. వెంటనే నిందితులు వారిని తుంగభద్ర ఎడమకాల్వలోకి తోసి, ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు. కాల్వలో పడిన డీనియల్, పంకజ్ కొద్దిసేపటికి ఈదుకుని ఒడ్డుకు వచ్చారు. అయితే, మునిగిపోయిన డిబాస్ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ హత్య మరియు అత్యాచారానికి సంబంధించి మల్లేశ్ (హండిమళ్ల), సాయి, శరణప్పలను అరెస్టు చేశారు. ఈ కేసు కొప్పళ సెషన్స్ కోర్టులో విచారణకు దారి చేరింది.