LOADING...
Bombs: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Bombs: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీలోని కొలోన్‌ (Cologne) నగరంలో రెండో ప్రపంచ యుద్ధం (World War II)కు చెందిన మూడు బాంబులు కనుగొనడం కలకలం రేపింది. అంతర్జాతీయ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ బాంబుల గుర్తింపు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై 20వేల మందికి పైగా స్థానికులను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలను నగరంలోని పలు చర్చిలు, క్రీడా మైదానాల్లో తాత్కాలికంగా నివాసం ఏర్పాటుచేసేలా ఏర్పాట్లు చేశారు. అదనంగా, కొలోన్ నగరానికి వెళ్లే రవాణా మార్గాలను తాత్కాలికంగా మూసివేయగా, నగరవ్యాప్తంగా అంబులెన్సులు, భద్రతా బలగాలను మోహరించారు. బాంబులు సోమవారం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెండింటి బరువు చెరో 1,000 కిలోలుగా ఉండగా, మూడో బాంబు 500 కిలోల బరువుతో ఉన్నట్లు గుర్తించారు.

Details

 1,000 మీటర్ల ప్రాంతం వరకు 'డేంజర్ జన్'గా ప్రకటింపు

బాంబులను నిర్వీర్యం చేయడానికి ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలను రంగంలోకి దించారు. బాంబులు గుర్తించిన ప్రాంతం చుట్టూ 1,000 మీటర్ల ఉన్న ప్రాంతాన్ని 'డేంజర్‌ జోన్'గా ప్రకటించారు. బాంబులు ప్రమాదవశాత్తు పేలితే కిలోమీటర్ల మేర తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. గతంలో ఇదే తరహా సంఘటనలు పలు సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు, 2017లో ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1.4 టన్నుల బాంబు లభించగా, 2024లో ఇప్పటివరకు 31 బాంబులు వెలుగుచూశాయని సమాచారం. WWII సమయంలో జర్మన్ నగరాలపై దాదాపు 1.5 మిలియన్ బాంబులు పడినట్టు అంచనా. వాటిలో సుమారు 20 శాతం బాంబులు పేలకుండానే మట్టిలో పూడిపోయినట్లు అధికారులు తెలిపారు.