Page Loader
Rakhi Thali for Modi: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి 'రాఖీ' థాలీని సిద్ధం చేసిన ప్రవాసులు 
దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి 'రాఖీ' థాలీని సిద్ధం చేసిన ప్రవాసులు

Rakhi Thali for Modi: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి 'రాఖీ' థాలీని సిద్ధం చేసిన ప్రవాసులు 

వ్రాసిన వారు Stalin
Aug 22, 2023
07:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

15వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. మోదీ రాకతో జోహన్నెస్‌బర్గ్‌ విమానాశ్రయం వందేమాతరం నినాదాలతో హోరెత్తింది. ఇదిలా ఉంటే, ప్రధాని మోదీ ప్రవాసుల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. త్వరలో రాఖీ పండుగ ఉన్న నేపథ్యంలో మోదీకి రాఖీ కట్టేందుకు మహిళలు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ప్రధాని మోదీకోసం ప్రత్యేకంగా 'రాఖీ థాలీ'ని కూడా సిద్ధం చేసినట్లు ప్రవాస మహిళలు తెలిపారు. మోదీ గణేశుడి ఆకారంలో ఉన్న రాఖీని కడుతున్నట్లు యాషికా సింగ్ అనే ప్రవాస భారతీయురాలు చెప్పింది. ఈ రాఖీ కట్టడం వల్ల మోదీకి అన్ని తొలగిపోవాలని ఆమె ఆకాంక్షించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ కోసం రాఖీ థాలీని సిద్ధం  చేసిన మహిళ